Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలో అతి పెద్ద టాయ్‌ రిటైలర్‌ Toys"R"Usను భారతదేశానికి తీసుకువచ్చిన ఏస్‌ టర్టెల్‌

Webdunia
శనివారం, 11 మార్చి 2023 (23:33 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ, సాంకేతికాధారిత రిటైల్‌ కంపెనీ ఏస్‌ టర్టెల్‌ నేడు ప్రపంచంలో అతిపెద్ద, ఎక్కువ మంది అభిమానించే టాయ్‌ స్టోర్‌ Toys R Usను భారతదేశంలోని వినియోగదారుల కోసం భౌతిక రూపంలో తీసుకువచ్చినట్లు వెల్లడించింది. ఈ నూతన Toys R Us రిటైల్‌ స్టోర్‌ను నేడు హైటెక్‌ సిటీ సమీపంలోని శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌ వద్ద ప్రారంభించారు.
 
ఈ నూతన స్టోర్‌లో ప్రపంచశ్రేణి బ్రాండెడ్ బొమ్మలు అందించడంతో పాటుగా చిన్నారుల కోసం తమ మస్కట్‌ జెఫ్రీ ద జిరాఫీతో పలు అనుభవపూర్వక టచ్‌పాయింట్లను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చిన్నారులకు అపరిమిత ఆనందాన్ని తీసుకువచ్చిన మహోన్నత వారసత్వం Toys R Usకు ఉంది. దాదాపు ఏడు దశాబ్దాలుగా అత్యున్నత నాణ్యత మరియు వైవిధ్యమైన బొమ్మల కలెక్షన్‌ను అది పిల్లలకు అందిస్తుంది. బార్బీ, లెగో, హాట్‌ వీల్స్‌, నెర్ఫ్‌ లాంటి బ్రాండ్ల బొమ్మలతో పాటుగా డిస్నీ, పారామౌంట్‌ నుంచి లైసెన్స్‌డ్‌ టాయ్స్‌ కూడా హైదరాబాద్‌లోని Toys R Us వద్ద  లభ్యమవుతాయి.
 
ఏస్‌ టర్టెల్‌ సీఈఓ నితిన్‌ చాబ్రా ఈ స్టోర్‌ ప్రారంభం గురించి మాట్లాడుతూ, ‘‘అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన  Toys R Us అనుభవాలను హైదరాబాద్‌లో మొదటి స్టోర్‌ ప్రారంభించడం ద్వారా చిన్నారుల చెంతకు తీసుకురావడం పట్ల సంతోషంగా ఉన్నాము. విస్తృతశ్రేణి, అత్యున్నత ఉత్పత్తుల ద్వారా స్టోర్‌ లోపల మరుపురాని అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము. దీనితో పాటుగా మహోన్నత వినియోగదారుల సేవా అనుభవాలనూ అందించనున్నాము.  ప్రభుత్వ మద్దతుతో భారతదేశంలో బొమ్మల పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. సంఘటిత రంగంలో  పరిమిత సంఖ్యలో ప్లేయర్లు ఉండటం వల్ల అపూర్వమైన అవకాశాలు ఉంటాయి.’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments