ఏప్రిల్ 30 తర్వాత బ్యాంకు ఖాతాలు బ్లాక్.. ఐటీ శాఖ వార్నింగ్.. ఎందుకో తెలుసా?

ఈనెలాఖరు తర్వాత బ్యాంకు ఖాతాలు బ్లాక్ కానున్నాయి. ఈ మేరకు ఆదాయ పన్ను శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 30వ తేదీలోపు బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబరును అనుసంధానం చేయని పక్షంలో ఖాతాలను బ్లాక్ చేయనున్నారు.

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (12:49 IST)
ఈనెలాఖరు తర్వాత బ్యాంకు ఖాతాలు బ్లాక్ కానున్నాయి. ఈ మేరకు ఆదాయ పన్ను శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 30వ తేదీలోపు బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబరును అనుసంధానం చేయని పక్షంలో ఖాతాలను బ్లాక్ చేయనున్నారు. 
 
అంతేకాదు, జులై 2014 నుంచి ఆగస్ట్ 2015 లోపు బ్యాంకు ఖాతా తెరిచిన వారు ఆధార్ వివరాలతో పాటు కేవైసీ వివరాలను కూడా సదరు బ్యాంకుకు సమర్పించాలని సూచించింది. విదేశీ పన్నుల అమలు చట్టానికి లోబడి ఖాతాదారులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఐటీ శాఖ కోరింది. 
 
ఈ డెడ్‌లైన్‌కు లోబడి అందరూ వివరాలు సమర్పించాలని లేని పక్షంలో ఖాతాను బ్లాక్ చేస్తామని, ఆ తర్వాత ఖాతా నుంచి ఎటువంటి లావాదేవీలకు అవకాశం ఉండదని ఐటీ శాఖ తేల్చి చెప్పింది. సదరు బ్యాంకులు కూడా ఈ మేరకు ఖాతాదారులను అప్రమత్తం చేయాలని సూచించింది. ఐటీ శాఖ నిర్ణయానికి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments