Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ నంబర్ ఉంటేనే రైల్ టిక్కెట్?

ఆధార్ నంబర్ ప్రతి ఒక్కదానికి ఆధారంగా మారింది. ఇప్పటికే బ్యాంకు ఖాతా ప్రారంభించడం నుంచి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెల్లించే కూలీ రేట్లకు కూడా ఆధార్ నంబరును తప్పనిసరి చేశారు.

Webdunia
బుధవారం, 9 మే 2018 (08:52 IST)
ఆధార్ నంబర్ ప్రతి ఒక్కదానికి ఆధారంగా మారింది. ఇప్పటికే బ్యాంకు ఖాతా ప్రారంభించడం నుంచి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెల్లించే కూలీ రేట్లకు కూడా ఆధార్ నంబరును తప్పనిసరి చేశారు. తాజాగా రైలు టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు కూడా తప్పనిసరి చేయనున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ ఓ సర్క్యులర్‌ను జారీచేయనుంది.
 
ఇటీవల ఈ-టికెట్ల (ఆన్‌లైన్ స్కామ్) కుంభకోణం వెలుగుచూసింది. రైల్వే అధికారులు ఇటీవల ముంబైకి చెందిన సల్మాన్‌ ఖాన్‌ నుంచి రూ.1.5 కోట్ల విలువైన 6 వేల ఈ-టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. 5400 మంది ఏజెంట్లను పెట్టుకొని.. తన బుకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకున్నందుకు వారి నుంచి ప్రతి నెలా రూ.700లను సల్మాన్ ఖాన్ వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
 
ఈ నేపథ్యంలో రైలు టిక్కెట్ల బుకింగ్‌లో ఆధార్ నంబరును తప్పనిసరి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. దీంతో ఈ దిశగా చర్యలు తీసుకోనుంది. ఇందులో టికెట్ల రాకెట్‌ను అడ్డుకొనేందుకు కొన్ని కఠిన నిబంధనలను అమలు చేయనున్నారు. ప్రయాణికుల యూజర్‌ ఐడీలను వారి ఆధార్‌ నంబర్లతో అనుసంధానం చేయాలని సూచించారు. అంతేగాక 'బుక్‌ నౌ' మీట నొక్కగానే ఓ ప్రశ్న/ఓటీపీ వచ్చే పద్ధతినీ పెట్టాలని సూచించారు. దీంతో మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments