దేశంలో సంభవిస్తున్న రోడ్డు ప్రమాద మృతుల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులో ఉన్నారు. వీరిలో ఎక్కువగా హెల్మెట్ ధరించకుండా తలకు గాయాలై ప్రాణాలు కోల్పోయిన వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో హెల్మెట్‌లు ధరించి వ
దేశంలో సంభవిస్తున్న రోడ్డు ప్రమాద మృతుల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులో ఉన్నారు. వీరిలో ఎక్కువగా హెల్మెట్ ధరించకుండా తలకు గాయాలై ప్రాణాలు కోల్పోయిన వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో హెల్మెట్‌లు ధరించి వాహనం నడపాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయినా వినిపించుకునే నాథుడే లేడు.
ఈ నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్... సరికొత్త నిబంధన విధించారు. హెల్మెట్ లేకపోతే పెట్రోల్ విక్రయించరాదని స్పష్టం చేశారు. ఈ నిబంధన యూపీలో సోమవారం నుంచి అమలుకానుంది. వాస్తవానికి తెలంగాణ సహా అనేక చోట్ల ఈ నిబంధన అమలు కోసం యత్నాలు జరిగాయి. అయితే పెట్రోల్ బంకుల నుంచి వ్యతిరేకత రావడంతో దీన్ని కొంతకాలం పాటు వాయిదా వేశారు. తమ అమ్మకాలు పడిపోతున్నాయని పెట్రోల్ బంకుల యజమానులు మొరపెట్టుకోవడంతో ఈ నిబంధనను అంత సీరియస్‌గా అమలు చేయడం లేదు.
అయితే కొత్తగా వచ్చిన యోగి రాజ్యంలో ఈ నిబంధన కాస్త కఠినంగానే అమలు చేయనున్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. దీంతో సోమవారం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.