Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖం తెల్లగా వుంటుంది... పెదవులు నల్లగా వుంటాయి... ఎలా?

ముఖం ఎంత అందంగా ఉన్న పెదాలు నల్లగా, పొడిబారినట్లు ఉంటే చూడటానికి బాగుండదు. పెదాలు ఎర్రగా, మృదువుగా ఉంటే ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. పెదాలపై పేరుకుపోయిన మురికిని, నలుపును ఎప్పుడుకప్పుడు తొలగించుకోవాలి. లేకపోతే చూడటానికి అసహ్యంగా కనిపిస్తుంది

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (19:51 IST)
ముఖం ఎంత అందంగా ఉన్న పెదాలు నల్లగా, పొడిబారినట్లు ఉంటే చూడటానికి బాగుండదు. పెదాలు ఎర్రగా, మృదువుగా ఉంటే ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. పెదాలపై పేరుకుపోయిన మురికిని, నలుపును ఎప్పుడుకప్పుడు తొలగించుకోవాలి. లేకపోతే చూడటానికి అసహ్యంగా కనిపిస్తుంది. దీనిని తొలగించుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవి ఏమిటో తెలుసుకుందాం.
 
1. ఒక టేబుల్ స్పూన్ తేనెలో కొంచెం పంచదార పొడిని కలిపి మెత్తగా పేస్టులా తయారుచేసుకోవాలి. దీనిని పెదాలపై సున్నితంగా 2 నిమిషాలపాటు మర్ధనా చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేయడం వలన పెదాలపై ఉన్న నలుపు పోయి ఎర్రగా, అందంగా కనిపిస్తాయి.
 
2. ఒక టేబుల్ స్పూన్ చక్కెరలో చిటికెడు పసుపు, కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని మెత్తని పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ పేస్టును పెదాలపై సున్నితంగా పూయాలి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. దీనిలో ఉన్న చక్కెర పెదాలపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తుంది. కొబ్బరి నూనె పెదాలను మాయిశ్చరైజర్ చేయడంలో సహాయపడుతుంది. పసుపులో ఉన్న సహజ ఔషధ గుణాలు పెదాలపై ఉన్న టాన్‌ని తొలగించడంతో పాటు పగిలిన పెదాలను రిపేర్ చేసి పెదాల చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. దీనిని తరచూ వాడటం వలన పెదాలు గులాబి రంగులో అందంగా కనిపిస్తుంటాయి.
 
3. ఒక టేబుల్ స్పూన్ బీట్ రూట్ జ్యూస్‌లో అర టీ స్పూన్ చక్కెర, కొద్దిగా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని పెదాలపై  సున్నితంగా పూయాలి. 15 నిమిషాల తర్వాత ఒక కాటన్ 
 
క్లాత్ తో తుడుచుకోవాలి.ఇది పెదాల చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి పెదాలను మృదువుగా, ఎర్రగా, అందంగా మార్చుతుంది.దీనిని పది రోజుల పాటు ప్రిజ్ లో నిల్వ చేసుకోవచ్చు.  
 
ఇలా క్రమం తప్పకుండా పాటించటం వలన ఎర్రటి పెదాలను మీ సొంతం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

తర్వాతి కథనం
Show comments