Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి ఎండలు ముదురుతున్నాయి... చర్మ సౌందర్యానికి చిట్కాలు...

ఎండలు బాగా పెరుగుతున్నాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాతావరణంలో సంభవించేటటువంటి మార్పులు ఎన్నో రకాల అనారోగ్యాలకు దారితీస్తాయి. ఉష్ణోగ్రతలోని హెచ్చుతగ్గుల వల్ల ఆహారం తీసుకునే పద్ధతిలో మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఎండలో బాగా తిరిగే

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (21:40 IST)
ఎండలు బాగా పెరుగుతున్నాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాతావరణంలో సంభవించేటటువంటి మార్పులు ఎన్నో రకాల అనారోగ్యాలకు దారితీస్తాయి. ఉష్ణోగ్రతలోని హెచ్చుతగ్గుల వల్ల ఆహారం తీసుకునే పద్ధతిలో మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఎండలో బాగా తిరిగే వారికి చర్మానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు కొన్ని చిట్కాల ద్వారా నివారించవచ్చు.
 
1. ఎండ ప్రభావం ముఖంపై ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ సమస్యను తొలగించుకోవాలంటే.... పచ్చిపాలలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. 
 
2. ఈ ఎండకాలంలో కొంత మంది ముఖంపై జిడ్డు ఎక్కువగా పేరుకుంటుంది. అలాంటి వారు ఒక టీ స్పూన్ నిమ్మరసంలో ఒక టీ స్పూన్ టమోటా రసాన్ని కలిపితే చక్కటి మాయిశ్చరైజర్ తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగివేయాలి. నిమ్మరసంలో మరియు టమోటా రసంలో ఉండే బ్లీచింగ్ ఏజెంట్స్ నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా మార్చి జిడ్డును తొలగిస్తాయి. 
 
3. ఎండలో ఎక్కువగా తిరిగే వారు రాత్రి పడుకునే ముందు కలబంద గుజ్జులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకొని పడుకోవాలి. ఇది చర్మంలోని మృతకణాలను తొలగించటంతో పాటు మెరిసే చర్మాన్ని అందిస్తుంది. ఇలా క్రమంతప్పకుండా పది రోజులు చేయడం వల్ల ముఖం మృదువుగా, అందంగా మారుతుంది.
 
4. పాలలో కొద్దిగా శెనగపిండి, చిటికెడు పసుపు కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగివేయాలి. ఇది చర్మంలో ఉన్న మురికిని తొలగించి ముఖాన్ని మృదువుగా మారుస్తుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments