Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి సౌందర్యం, పెదవులకు టొమాటో రసం పూస్తే...

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (20:53 IST)
టొమాటోలో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. వీటిలో సెలినీయం అనే యాంటీఆక్సీడెంట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది సూర్యకిరణాల నుండి మీ చర్మాన్ని, పెదవులను కాపాడుతుంది. కాబట్టి ప్రతిరోజు దీనిని ఏదో ఒక రూపంలో తీసుకునేలా చూసుకోవాలి. ఎండలో నుంచి రాగానే మీ పెదాలకు టొమాటో గుజ్జు లేదా రసం పూయడం వల్ల అవి తమ సహజ రంగును కోల్పోకుండా ఉంటాయి.
 
ప్రతిరోజు చెంచా తేనె తీసుకోవాలి. ఇది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే రాత్రుళ్లు పెదాలకు తేనె రాసుకుని మర్నాడు కడిగివేయాలి. తేనెలోని యాంటీ ఆక్సీడెంట్లు, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు పెదాలపై ఉండే నలుపుదనాన్ని పోగొడతాయి.
 
పెరుగు మన శరీరానికి చలువ చేస్తుంది. దీనిలో మాంసకృత్తులు మీ చర్మాన్ని దృడంగా, నవయవ్వనంగా ఉంచుతాయి. దీనిని రోజూ మీ భోజనంలో తీసుకోవాలి. కాస్తంత పెరుగును చేత్తో తీసుకుని మీ పెదాలకు రాసుకున్నా అవి క్రమంగా మృదువుగా మారుతాయి. పిగ్మంటేషన్ సమస్యను కూడా తగ్గిస్తాయి.
 
గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. నిమ్మ సహజ బ్లీచ్ లా పని చేస్తుంది.  నిమ్మ తొక్కపై కొంచెం చక్కెర వేసి దానిని పెదాలపై మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల పెదవులపై నలుపు తగ్గుతుంది.
 
టీ, కాఫీలు తాగడం వల్ల కూడా పెదవులు నల్లగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి బదులుగా గ్రీన్ టీ తీసుకుంటే మంచిది. ఇందులోని ఫాలీఫినాల్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. అంతేకాదు వయసు పెరగడం, ఎండ వేడి వల్ల కమిలిపోయిన పెదాలకు రక్షణ కల్పిస్తాయి. టీ బ్యాగుల్నీ పెదాలపై మృదువుగా మర్దనా చేయడం వల్ల ఎండిపోయి పగిలిన పెదాలకు సాంత్వన లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

తర్వాతి కథనం
Show comments