Publish Date: Wed, 10 Mar 2021 (23:01 IST)
Updated Date: Wed, 10 Mar 2021 (23:03 IST)
టమోటాలు కాలేయం, మెదడు రెండింటినీ మద్యపానం వల్ల కలిగే నష్టం నుండి కాపాడతాయని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. టమోటా రసం, సలాడ్ లేదా సాస్ అయినా కాలేయానికి మేలు చేస్తాయని నిపుణులు చెపుతున్నారు.
అంతేకాదు... టమోటా రసం తాగటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎముకలు కొందరిలో చాలా బలహీనంగా ఉంటాయి. ఇలాంటి వారు రోజుకు రెండు గ్లాసుల టమోటా రసం తాగినట్టయితే ఎముకలు బలంగా తయారవుతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు. అంటే ఆస్టియోపోరొసిస్ రాకుండా ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు. దీనికి కారణం టొమాటోలో లైకోపీన్ అనే యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయని, వీటివల్ల ఎముకలు చాలా దృఢంగా ఉండేలా చేస్తాయని పరిశోధకులు చెపుతున్నారు.
టమోటాలు, వాటితో చేసిన పదార్థాలకు నెలరోజుల పాటు వాడిన మహిళల్లో ఎముకలు విరిగే సమయంలో విడుదలయ్యే ఎన్‌టీలోపప్టైడ్ అనే ఒక రకమైన రసాయన స్థాయి పెరగడాన్ని గుర్తించినట్టు పరిశోధకులు చెపుతున్నారు. ఆ తర్వాత నాలుగు నెలల పాటు 15 మిల్లీ గ్రాముల లైకోపీన్ ఉన్న టమోటా రసాన్ని ఇస్తే ఈ రసాయనాల స్థాయి చాలావరకు తగ్గిపోయింది. దీన్ని బట్టి టమోటలు తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయనే విషయం తమ పరిశోధనల్లో నిరూపణ అయిందని వారు చెపుతున్నారు.
సిహెచ్
Publish Date: Wed, 10 Mar 2021 (23:01 IST)
Updated Date: Wed, 10 Mar 2021 (23:03 IST)