Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంటసోడా, బొప్పాయి గుజ్జుతో.. చలికాలంలో అందం....

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (14:58 IST)
చలికాలంలో అందాన్ని కోల్పోకుండా ఉండడానికి రకరకాల క్రీములు, ఫేస్‌ప్యాక్ వాడుతుంటారు. వీటిని వాడడం వలన సమస్య ఎక్కువవుతుందే గానీ, ఎలాంటి ఫలితం ఉండదు. అంతేకాదు.. చర్మం దద్దుర్లుగా, దురదగా మారుతుంది. దీని కారణంగా పలురకాల ఇన్‌ఫెక్షన్స్ ఏర్పడే అవకాశాలున్నాయని చెప్తున్నారు. మరి ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి...
 
1. వంటసోడాలో కొద్దిగా నీరు, బొప్పాయి గుజ్జు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత వెచ్చని నీళ్లలో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే చర్మ దద్దుర్లు, ఇన్‌ఫెక్షన్స్ తొలగిపోతాయి. 
 
2. మామిడి ఆకులను నూనెలో వేయించి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. గంట తరువాత శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.
 
3. బొప్పాయి ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే చర్మ దురదలు పోతాయి. బొప్పాయిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మంలోని చెడు బ్యాక్టీరియాలను తొలగిస్తాయి. 
 
4. మునగాకులను బాగా ఎండబెట్టుకుని మీక్సిలో మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మెుటిమ సమస్య ఉండదు. మునగలోని విటమిన్స్ డి చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తుంది. 
 
5. మిరియాల నీటిలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచాగ చేస్తే ముడతల చర్మం తొలగిపోతుంది. 
 
6. పెరుగులో కాస్త జీలకర్ర వేసి మెడకు రాసుకోవాలి. గంట పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే మెడపై గల నల్లటి మచ్చలు పోతాయి. 
 
7. బంగాళాదుంపని మెత్తని పేస్ట్‌లా అందులో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, రోజ్ వాటర్, ముల్తానీ మట్టి కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తే ముఖం తాజాగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

Bengaluru murder: ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments