టీనేజ్ అమ్మాయిల అందానికి మెరుగులు ఎలా?

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (21:39 IST)
టీనేజ్ యువతులు తమతమ శరీరం కాంతివంతంగా అందంగా వుండాలని కోరుకుంటారు. ఇందుకోసం ఏవేవో క్రీములు రాస్తూ వున్న అందాన్ని పోగొట్టుకుంటారు. అలా కాకుండా ఇంట్లోనే చిన్నచిన్న చిట్కాలతో అందంగా వుండొచ్చు. అదెలాగో చూద్దాం.
 
* శరీర కాంతి నిగనగలాడేందుకు నిమ్మకాయ ఎంతో ఉపయోగపడుతుంది. నిమ్మకాయను పలు ఫేస్ ప్యాక్‌లలో ఉపయోగించి వాడుతుంటారు. దీంతో శరీర మేనిఛాయ మెరుగౌతుంది. 
 
* చర్మం నల్లగా ఉంటే దానిని రూపుమాపేందుకు పాల మీగడలో నిమ్మకాయ రసాన్ని కలుపుకుని ముఖానికి రాయండి. కాసేపయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయండి. 
 
* మోకాళ్ళు, మోచేతులపైనున్న నలుపుదన్నాన్ని దూరం చేసేందుకు నిమ్మకాయ తొక్కతో రుద్దండి. దీంతో నలుపుదనం తొలగిపోతుంది. 
 
* మేని ఛాయను మెరుగుపరచుకునేందుకు టమోటా రసంలో కాసింత పసుపు పొడి కలుపుకుని మీ ముఖానికి పూయండి. కాసేపయ్యాక చల్లటి నీటితో మీ ముఖాన్ని కడిగేయండి. దీంతో అందం మరింత రెట్టింపవుతుంది. 
 
* ద్రాక్ష రసంలో తేనె కలుపుకుని ముఖానికి పూయండి. దీంతో మీ ముఖారవిందం పెరుగుతుంది.
 
* ప్రతి రోజు మీరు స్నానం చేసేటప్పుడు వేపనూనెతో తయారు చేసిన సబ్బును వాడండి లేదా నాలుగు చుక్కలు డెటాల్ కలుపుకుని స్నానం చేయండి. దీంతో ముఖంపై నున్న మొటిమలు తొలగిపోతాయి.  
 
* చందనపు పేస్ట్‌లో గులాబీ జలాన్ని (రోజ్ వాటర్) కలుపుకుని మొటిమలపై పూయండి. ఈ లేపనాన్ని కనీసం అరగంట ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఇలా ప్రతి 15 రోజులపాటు చేయండి. ఈ 15 రోజులలో మొటిమలను దూరం చేసుకోవచ్చు. 
 
* పుదీనాను రుబ్బుకుని మొటిమలకు రాయండి. ఇలా 15 రోజులపాటు ప్రతి రోజూ అరగంటపాటు పూస్తే ఉపశమనం కలుగుతుంది. 
 
* తులసి ఆకుల రసాన్ని టమోటాల రసంలో కలుపుకుని మొటిమలకు పూస్తే ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉద్యోగి తీవ్రమైన అక్రమాలకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగించడం సబబే : సుప్రీంకోర్టు

'ఆకాశంలో ఒక తార' హీరోయిన్ స్నేహితురాలిపై అత్యాచారం

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - పలు జిల్లాలకు హెచ్చరిక

గెలిచినా ఓడినా నేర్చుకోవడం ఆపొద్దు : రష్మిక మందన్నా

రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువలో ఎన్డీయే

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రజలు కుక్కలు అని ఎలా అంటాను? టీవీకె గురించి నేనలా అన్నాననీ: రాఘవ లారెన్స్

కాశీలో రేణూ దేశాయ్.. ఎందుకో తెలుసా?

Mohanlal: మోహన్‌లాల్ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌

Bhogi: శర్వా.. భోగి చిత్రం కోసం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సంపత్ నంది

V.V. Vinayak: వడ్డే నవీన్‌ సినిమాలు ఇష్టంతో చేయలేదు : వి. వి. వినాయక్

తర్వాతి కథనం
Show comments