Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చర్మ సౌందర్యాన్ని పెంచే నూనెలు...

Advertiesment
Oils
, సోమవారం, 16 సెప్టెంబరు 2019 (11:27 IST)
కురులు బలంగా, దృఢంగా పెరగడానికి నూనె పట్టిస్తాం. అంతేకాదు చర్మాన్ని తేమగా, యవ్వనంగా ఉంచటడంలో కూడా నూనెలు చక్కగా పనిచేస్తాయి. చర్మాన్ని శుభ్రం చేయడం, ముడతలు పడకుండా చూడడంతో పాటు చర్మానికి సాగేగుణాన్ని అందిస్తాయి కూడా. ఇంతకీ ఈ నూనెల్లో ఏముందీ అంటే....
 
కొబ్బరి నూనె: ఈ నూనె శిరోజాలను పటిష్టింగా, మెరిసేలా చేస్తుంది. వేడిచేసిన కొబ్బరి నూనెను జట్టుకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచాలి. దీంతో దెబ్బతిన్న కురులను పునరుద్దరిస్తుంది. వెంట్రుకలు కొసల భాగంలో చిట్లిపోకుండా చూస్తుంది. అంతేకాదు ఎండకు కందిన చర్మానికి సాంత్వననిస్తుంది. మృదువుగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
 
ఆలివ్ నూనె: దీనిలోని మినరల్స్, విటమిన్లు జుట్టు, చర్మాన్ని సున్నితంగా ఉంచడమే కాదు పోషణనిస్తాయి కూడా. పనిపిల్లల చర్మాన్ని మరింత మృదువుగా మార్చుతుంది. పొడిచర్మానికి తేమనందించి ఆరోగ్యంగా ఉంచుతుంది. చుండ్రు, ఆయిలీ జుట్టు ఉన్నవారు ఆలివ్ నూనె రాసుకుంటే ఫలితం ఉంటుంది. 
 
బాదం నూనె: అన్ని రకాల చర్మం వారికి ఇది చక్కగా పనిచేస్తుంది. మసాజ్ ఆయిల్‌గా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ నూనె రాసుకుంటే పొడిచర్మం, చర్మం దురద పుట్టడం, చర్మం వేడెక్కడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
నువ్వుల నూనె: ఇది చాలా తేలికగా ఉంటుంది. వాసన ఉండదు. చర్మం ఈ నూనెను తొందరగా పీల్చుకుంటుంది. అంతేకాదు బాడీ మసాజ్‌గా ఉపయోగపడుతుంది. చర్మాన్ని కోమలంగా ఉంచుతుంది. సన్‌స్క్రీన్ లోషన్‌గానూ పనిచేస్తుంది. ముఖాన్ని తేమగా, తాజాగా కనిపించేలా చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొట్ట తగ్గాలనుకుంటున్నారా.....?