Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్లటి పెరుగుతో చుండ్రు మటాష్!

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (11:56 IST)
చాలా మందిని చుండ్రు సమస్య వేధిస్తూ ఉంటుంది. దీంతో నలుగురిలో నిలబడాలంటే వారు చిన్నతనంగా భావిస్తుంటారు. ఇలాంటి ఇంటి వద్దనే చిన్నపాటి చిట్కాలతో సమస్య నుంచి గట్టెక్కవచ్చు. వెనిగర్‌ని, నీటిని సమపాళ్ళలో తీసుకు‌ని మీ జుట్టుకి పట్టించి తల స్నానం చేస్తే చుండ్రు నుంచి విముక్తి లభిస్తుంది.
 
అలాగే, పుల్లటి పెరుగుని తలకు పట్టించి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు నుంచి మంచి ఫలితం లభిస్తుంది, అంతేకాక జుట్టు మెరుస్తుంది. 2 స్పూన్లు మెంతులు తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు వాటిని పిండిగా చేసి మీ తలకు పట్టించుకుని 15-20 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఆ నానబెట్టిన నీటిని పారవేయకుండా, స్నానం తర్వాత మీ జుట్టుని ఈ నీటితో శుభ్రం చేస్తే చుండ్రు సమస్య చాలా మేరకు తగ్గుతుంది. అంతేగాక జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
 
ఆలివ్ ఆయిల్ మీ జుట్టులోని పొడితనాన్ని, చుండ్రునీ తొలగించుటలో ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని మీ జుట్టుకి పట్టించి మసాజ్ చేయాలి, తర్వాత మీ జుట్టుని ఒక టవల్‌తో చుట్టుకోవాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇలాక్రమం తప్పకుండా చేయడం ద్వారా చుండ్రు సమస్య నుండి శాశ్వతంగా తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments