Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడమీద నలుపుగా ఉందా? అయితే ఈ చిట్కాలు పాటించండి..

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (11:35 IST)
మీ మెడ నల్లగా మారిందా.. కొన్ని చిట్కాలు పాటించడం వలన మీ మెడ తెల్లగా, మృదువుగా చేసుకోవచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం. నిమ్మకాయ రసంలో కొద్దిగా ఉప్పు కలిపి మెడమీద రుద్దుకుని 5 లేదా 10 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. నిమ్మకాయలలోని విటమిన్ సి మెడమీద ఉన్న మృతకణాలను నాశనం చేస్తుంది. 
 
అలాగే సూర్యరశ్మి వలన వచ్చే నలుపును కూడా తొలగిస్తుంది. ఒక స్పూన్ నిమ్మరసంలో స్పూన్ దోసకాయరసం కొద్దిగా గంధం కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మెడమీద రాసుకుని అరగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. రోజు ఈ విధంగా చేయడం వలన మీ మెడమీద నలుపు త్వరగా తగ్గిపోతుంది.
 
మెడ తెల్లగా కావాలంటే ఒక స్పూన్ గంధంలో కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రివేళ మెడకు రాసుకుని ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మెడతెల్లగా మారుతుంది. నిమ్మరసంలో కొద్దిగా పసుపు కలిపి పెట్టుకున్నా కూడా మెడ తెల్లగా కనిపిస్తుంది. ఆలుగడ్డను ముక్కలుగా కోసుకుని రెండు వారాలకోసారి మెడమీద రుద్దుకుంటే మీరే ఆ తేడాని గమనించవచ్చును.
 
బాదం పప్పులను 5 నుంచి 6 తీసుకుని నాలుగు గంటలు నీళ్ళలో నానబెట్టాలి, ఆ తరువాత వాటికి పొట్టుతీసి కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి పడుకునే ముందు మెడమీద రుద్దుకుని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మెడ మీద గల నలుపు తొలగిపోతుంది. కలబంద రసాన్ని మెడమీద రుద్దుకుని 20 నిమిషాల తరువాత కడిగేసుకుంటే మెడతెల్లగా కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments