Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెుక్కజొన్న గింజల నూనెను చర్మానికి రాస్తే...

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (23:08 IST)
మెుక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచి ఎప్పటికి చిన్నవారుగా కనపడేలా చేస్తాయి. మెుక్కజొన్న గింజల నూనెను చర్మానికి రాస్తే దీనిలో ఉండే లినోలె యాసిడ్ చర్మ మంటలను, ర్యాష్‌లను తగ్గిస్తుంది.
 
మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. మెుక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు ఉంటే అది మలబద్దకం, మెులలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్ అరికడుతుంది.
 
ఎముకల బలానికి అవసరమైన లవణాలు, మినరల్స్ మెుక్కజొన్నలో పుష్కలంగా ఉంటాయి. పసుపు రంగులో ఉండే ఈ చిన్న గింజలలో మినరల్స్ అధికంగా ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటివి కూడా వీటిలో ఉండి ఎముకలు గట్టిపడేలా చేస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచటంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి.
 
మెుక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ ఉండటం వలన అది రక్తహీనతను తగ్గిస్తుంది. మెుక్కజొన్నను ప్రతిరోజు తినడం వలన హెయిర్ ఫోలీ సెల్స్‌కు బలాన్ని చేకూరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి పవర్‌పుల్ యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ వల్ల హెయిర్ స్మూత్‌గా, మంచి షైనింగ్‌గా ఉంటుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments