How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సెల్వి
శుక్రవారం, 13 జూన్ 2025 (22:00 IST)
Hair Oil
మహిళలు జుట్టుకు నూనె రాయడం ఒక సాంప్రదాయ పద్ధతి. ఇది జుట్టుకు పోషణ అందించడం, జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. జుట్టుకు నూనె ఎలా రాస్తే.. జుట్టు, మాడుకు మేలు చేకూరుతుందో తెలుసుకుందాం... జుట్టుకు నూనె రాసేటప్పుడు తొలుత జుట్టు రకానికి సరైన నూనెను ఎంచుకోవడం. కొబ్బరి నూనె జుట్టుకు రాసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే మీది పొడి జుట్టు అయితే ఆలివ్ నూనెను ఉపయోగించాలి. ఇలా జుట్టుకు తగిన నూనెకు ఎంచుకోవాలి. 
 
నూనె రాసుకునే ముందు, జుట్టును శుభ్రంగా, పొడిగా ఉండేలా చూసుకోవాడి. ఇది నూనె మాడుకు, జుట్టుకు సులభంగా చేరుకునేలా చేస్తుంది. అదే జుట్టు మురికిగా లేదా తడిగా ఉంటే, నూనె బాగా పీల్చుకోకపోవచ్చు. అవసరమైతే జుట్టును కడగడానికి తేలికపాటి షాంపూని ఉపయోగించండి. బాగా ఆరిన తర్వాత నూనె రాయడం ప్రారంభించండి. కొబ్బరి నూనెను కాసింత వేడి చేసి వేడి తగ్గిన తర్వాత గోరు వెచ్చగా వున్నప్పుడు.. తలపై పూయడం ప్రారంభించండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

జుట్టుతో పాటు కుదుళ్లు, మాడుకు సైతం ఈ నూనె చేరేలా మసాజ్ చేయండి. వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయడానికి కనీసం ఐదు నుండి పది నిమిషాలు తీసుకోండి. ఇది నూనె మాడుకు చేరుకోవడంతో పాటు శరీరానికి ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. మసాజ్ ద్వారా రక్త ప్రసరణను మెరుగవుతుంది. తద్వారా జుట్టు పెరుగుతుంది.
 
నూనె రాసుకుని మసాజ్ చేసిన తర్వాత, గంట పాటు అలానే వుంచండి. సూపర్ కండిషనింగ్ కోసం, దానిని రాత్రంతా అలాగే ఉంచవచ్చు. అయితే, ఎక్కువసేపు అలాగే ఉంచకుండా తేలిక పాటి షాంపుతో తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి నూనె రాసి మసాజ్ చేయడం.. వీలైతే ఆయుర్వేద మూలికలతో కూడిన షాంపూలను వాడటం ద్వారా జుట్టు పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వామ్మో... యువతి ప్యాంటు జేబులో పేలిన ఫోను, మంటలు (video)

తొక్కిసలాటపై విజయ్, అజిత్, ధనుష్ బాధపడుతున్నారు: నటి అంబిక

తిరుమలలో 3 గంటల పాటు భారీ వర్షం.. ఇబ్బందులకు గురైన భక్తులు

Jagan Anakapalle Tour: జగన్ రోడ్ టూర్‌కు అనుమతి నిరాకరణ

ప్రియురాలితో రాత్రంతా గడిపి హత్య చేసి ఇంట్లోనే సమాధి చేసిన కర్కోటకుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

తర్వాతి కథనం
Show comments