Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి పాలు, నిమ్మరసంతో ఫేస్‌ప్యాక్..?

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (11:05 IST)
కొందరికైతే ముఖంపై, కళ్ల కింద నల్లటి వలయాలు అధికంగా ఉంటాయి. ఈ వలయాల కారణంగా ముఖచర్మం అందాన్ని కోల్పోతుంది.  వీటిని తొలగించుకోవడానికి ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. ఈ సమస్యకు ఎవరినైనా పరిష్కారం అడిదితే.. వాళ్లేమో.. బయటదొరికే క్రీమ్స్ వాడండి లేదా ఫేస్‌ప్యాక్స్ ఉపయోగించి చూడండని చెప్తుంటారు.  
 
సరేనని వాళ్లు చెప్పిన విధంగానే ఈ రెండింటిని వాడుతారు. కొన్ని రోజూలు బానే ఉన్నది. ఆ తరువాత ఏమైందంటే.. సమస్య మరింతగా ఎక్కువై పోయింది. అందుకు మరో క్రీమ్ ఉపయోగిస్తుంటారు. ఇలా ఒక్కొక్క సమస్యకు ఒక్కో క్రీమ్ వాడితే చర్మం ఏమవ్వాలని..? అందువలన ఇంట్లో ఈ చిట్కాలు పాటించి చూడండి.. వారం రోజుల్లో మీకే తేడా కనిపిస్తుంది. మరి అవేంటే ఓసారి పరిశీలిద్దాం...
 
ఓ చిన్న బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్ల కొబ్బరి పాలు, 1 స్పూన్ నిమ్మరసం, 2 స్పూన్ల కీరదోస తురుము, కొద్దిగా ముల్తానీ మట్టి వేసి బాగా పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట తరువాత చేతివేళ్లతో ముఖాన్ని మర్దన చేసుకుని గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. తరుచు ఇలా చేస్తుంటే కచ్చితంగా మార్పు వస్తుంది.
 
తరచు అందరూ చెప్పేమాట.. బంగాళాదుంపలు తీసుకుంటే శరీర నొప్పులు వస్తాయని.. అది నిజం కాదు. బంగాళాదుంప అనారోగ్యాల నుండి కాపాడుతుందే తప్ప.. రోగాలకు గురికానివ్వదు. ఇలాంటి బంగాళాదుంపతో ప్యాక్ వేసుకుంటే.. ఏమవుతుందో చూద్దాం.. 1 కప్పు బంగాళాదుంప ముక్కలను మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఈ ప్యాక్ బాగా ఆరిన తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా వారంపాటు చేస్తే నల్లటి వలయాలు తొలగిపోతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

PoK: పెరిగిన జీలం నది నీటి మట్టం- అంతా భారత్ చేసిందా.. వరద ముప్పు..? (video)

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments