నేత్రాల అందాన్ని రెట్టింపు చేయాలంటే..?

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (12:28 IST)
ప్రతి జీవికి నేత్రం ఎంతో ముఖ్యం. నేత్రాలు లేకుంటే అందమైన సృష్టిని చూడలేం. మనిషికి నేత్రాలు ఎంత ముఖ్యమో.. వాటి పరిరక్షణ కూడా అంతే ముఖ్యం. వీటి పరిరక్షణ కోసం కొన్ని చిట్కాలు... 
 
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మంచి నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి. ముఖం కడుక్కునేటప్పుడు ఎవరి తువ్వాలును వారే ఉపయోగించాలి. మండుటెండ, దుమ్ము, పొగనుండి కళ్ళను కాపాడుకోవాలి. సూర్య గ్రహణాన్ని చూడాలనుకునేవారు నల్లటి కళ్ళజోడును తప్పనిసరిగా ధరించాలి.
 
పుస్తకం చదువుతున్నప్పుడు పుస్తకాన్ని కంటి నుండి ఒకటిన్నర అడుగు దూరం ఉంచి చదవాలి. ఎడమచేతి పక్కనుండి వెలుతురు పడేలా చూడాలి. మసక వెలుతురులోనూ, జారగిలపడినప్పుడు, ఆనుకున్నప్పుడు పుస్తకం చదవరాదు. తక్కువ వెలుతురులో కనీసం 10 అడుగుల దూరంగా ఉండే టెలివిజన్ చూడాలి. 
 
విటమిన్ ఎ పుష్కలంగా ఉన్న బచ్చలికూర వంటి ఆకుకూరలను, ఆప్రికాట్ లాంటి రేగు పండు, జాతి పండ్లు, క్యారెట్స్‌, పాలు, వెన్న, చేప కాలేయం నూనె, గుడ్డులోని పచ్చసొన వంటివి ఎక్కువగా తింటే నేత్రాలు ఆరోగ్యంగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

వైఎస్ జగన్‌ను కలిసిన కొడాలి నాని.. ఫోటోలు వైరల్

ప్రధాని మోడీ పొదుపు మంత్రం - ఎద్దుల బండిపై పోలీస్ కానిస్టేబుల్ బారాత్

ప్రేమికుల పెళ్లి విషయంలో రూ. 70 వేల లంచం అడిగిన ఎస్సై, ACBకి పట్టించారు

అరుదైన ఖనిజ నిక్షేపాలలో సుమారు 30 శాతం వాటాను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్: B2K విశ్లేషణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments