నేటి తరుణంలో చాలామంది బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాయామం చేయడం, పలురకాల డైట్‌లను పాటించడం, పోషకాహారం, మందులను తీసుకోవడం వంటివి చేస్తున్నారు. అయినను ఎలాంటి ఫలితాలు కనిపించక సతమతమవుతున్నారు. అలాంటి వారు కింద తెలిపిన విధంగా పలు సూచనలు పాటిస్తే.. బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
1. ప్రతిరోజూ మీ ఆహారంలో ప్రోటీన్స్ అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే అధిక బరువు తగ్గుతారని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు. అలానే ఫైబర్ శాతం ఎక్కువగా ఉన్న ఆహారాలను తింటుంటే కూడా ఆకలి నియంత్రణలో ఉంటుంది.
2. ప్రతిరోజూ ఉదయాన్నే 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే బరువు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. వాకింగ్ చేయడం వలన శరీరానికి నిత్యం చక్కని వ్యాయామం జరుగుతుంది. దాంతో శరీరంలోని కొవ్వు శాతం తగ్గుముఖం పడుతుంది.
3. అన్నింటికంటే ముఖ్యంగా.. రోజుకు తగినంత నీరు తాగడం వలన కూడా బరువు తగ్గుతారు. మన శరీరానికి తగినంత నిద్ర కూడా రోజూ అవసరమే. రోజూ తగినన్ని గంటలపాటు నిద్రించడం వలన అధిక బరువు తగ్గుతారని వారు సూచిస్తున్నారు.
4. తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి. తరచు తేనెను గ్లాస్ నీటిలో కలిపి తాగుకుంటే బరువు తగ్గుతారు. కనుక నెలపాటు ఇలా క్రమంగా చేసి చూడండి.. మీకే తేడా కనిపిస్తుంది.