Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం పిండి...?

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (12:09 IST)
ఇప్పటి కాలంలో చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా చాలామందికి వెంట్రుకలు నెరసిపోతున్నాయి. దీని కారణంగా నలుగురిలో తిరగడానికి మొహమాటపడుతుంటారు. ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
 
1. నువ్వులను మెత్తని పేస్ట్‌లా చేసి అందులో బాదం నూనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి తలకు రాసుకుని గంటపాటు అలానే ఉండాలి. ఆపై గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.
 
2. ఉల్లిపాయ పేస్ట్ తెల్ల వెంట్రుకల మీద బాగా పనిచేస్తుంది. కాకపోతే ఈ పేస్ట్‌ను మాడుకు పట్టించి పూర్తిగా ఆరిపోయే వరకు అలానే ఉండాలి. తరువాత నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచు చేస్తుంటే.. తెల్ల జుట్టు నల్లగా తయారవుతుంది.
 
3. క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందువలన రోజూ గ్లాస్ క్యారెట్ తాగితే మంచిది. అలానే తెల్ల వెంట్రుకలున్న వారు నిత్యం గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగితే ఫలితం ఉంటుంది.
 
4. ఉసిరికాయ పొడిలో కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి తలకు అప్లై చేయాలి. ఈ వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తుంటే.. తెల్ల వెంట్రుకలు పోతాయి. దాంతోపాటు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
 
5. కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం పిండి దాన్ని మాడుకు రాసుకుంటే మంచిది. తెల్ల వెంట్రుకల మీద ఇది మంచి ప్రభావం చూపుతుంది. అంతేకాదు.. శిరోజాలను అందంగా, కాంతివంతంగా కూడా చేస్తుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments