అవకాడో గుట్టుకు జుట్టుకు పట్టిస్తే..?

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (14:52 IST)
చాలామందికి జుట్టు పొడుగ్గా, ఒత్తుగా ఉంటుంది. అయినను వారికి మనశ్శాంతి ఉండదు. ఎందుకని అడిగితే.. చుండ్రు కారణంగా.. ఇంత జుట్టు ఉండి కూడా ఏం ప్రయోజనం ఉంది.. అంటూ బాధపడుతుంటారు. అందుకు.. బ్యూటీ నిపుణులు ఇలా చెప్తారు. ఇంటి నుండి బయటకు అడుగు పెడితే చాలు కాలుష్యంతో వెంట్రుకలు పాడవుతున్నాయి. ఎలాంటి జుట్టుకైనా సరైన జాగ్రత్తలు తీసుకుంటే కొంతమేరకైనా ఈ సమస్యను అరికట్టవచ్చని చెప్తున్నారు.. మరి ఆ జాగ్రత్తలేంటో ఓసారి పరిశీలిద్దాం..
 
ఓ చిన్న అవకాడో తీసుకుని దాని గుజ్జును మాత్రం ఓ చిన్న బౌల్‌లో వేసి అందులో కొద్దిగా పెరుగు కలిపి జుట్టుకు పూతలా వేయాలి. ఓ గంటపాటు అలానే ఉంచి ఆపై తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తే చుండ్రు రాదు. రేగినట్టు ఉండే జుట్టుకు అవకాడో ఎంతో దోహదపడుతుంది. దీనిని జుట్టుకు రాసుకోవడం వలన కురులు మృదువుగా, నాజ్జుగా తయారవుతాయి. 
 
తరచు వేధిస్తున్న చుండ్రును పోగొట్టాలంటే.. 2 స్పూన్ల్ బ్రౌన్ షుగర్‌కు ఓ స్పూన్ హెయిర్ కండిషనర్ కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు పట్టించి.. 20 నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రంగా కడుక్కుంటే.. చుండ్రు సమస్య పోతుంది. ఇలా నెలకు ఒకసారి చేస్తే చాలు ఫలితం ఉంటుంది.
 
సూర్యకిరణాల వలన వెంట్రుకలు దెబ్బితింటాయనే విషయం అందరికి తెలిసిందే.. కాబట్టి జుట్టుకు తేనెలో 2 స్పూన్ల్ ఆలివ్ నూనె వేసి బాగా కలిపి జుట్టు పట్టించి ఆ తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తేనె, ఆలివ్ నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్ గుణాలు జుట్టు సంరక్షణకు చాలా పనిచేస్తాయి.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగారు గొలుసు కోసం వృద్ధురాలిని హత్య- ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దంపతుల దారుణం

జనవరి 29 నుండి ఫిబ్రవరి 1 వరకు అరకు చలి ఉత్సవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం

అప్పు తీర్చమన్నందుకు వృద్ధుడిని సజీవ దహనం చేశారు.. ఎక్కడ?

అక్రమ మైనింగ్‌ను బాట వేస్తోన్న ఉచిత ఇసుక విధానం.. పచ్చి మోసం.. గోవర్ధన్ రెడ్డి

రైల్వేకోడూరు ఎమ్మెల్యే వల్ల 5 సార్లు ప్రెగ్నెంట్, అబార్షన్ అయ్యింది: మహిళ ఆరోపణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా.. కానీ కొన్నాళ్ళకే అసలు విషయం తెలిసింది.. : తమన్నా

15 రోజుల్లో ₹358 కోట్లకు పైగా వసూలు చేసిన మన శంకరవరప్రసాద్ గారు

ఆ బాలీవుడ్ హీరోయిన్ నా లక్కీ ఛార్మ్ : కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ

బరాబర్ ప్రేమిస్తా లో మళ్లీ మళ్లీ సాంగ్ బాగుంది : జయంత్ సి పరాన్జి

న్యాయం చేసేలా ప్రయత్నిస్తా : రఘు కుంచె - దేవగుడి అలరిస్తుంది : బెల్లం రామకృష్ణ రెడ్డి

తర్వాతి కథనం
Show comments