స్త్రీలు మల్లె పువ్వులను సౌందర్య సాధనంగా ఉపయోగిస్తుంటారు. అవి సౌందర్యానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మరి అవేంటో ఓసారి పరిశీలిద్దాం.. కొబ్బరి నూనెలో మల్లెపువ్వులు వేసి రాత్రంతా బాగా నానబెట్టి ఆ తరువాత మరిగించుకోవాలి. ఈ నూనె తలకు పట్టిస్తే కురులు ఆరోగ్యవంతంగా మారడమే కాకుండా.. మాడుకు చల్లదనాన్ని చేకూర్చుతాయి.
రోజంతా అలసిపోయిన కనులపై మల్లె పువ్వులను కాసేపు ఉంచినట్టయితే చలవనిస్తాయి. తలలో చుండ్రు ఎక్కువగా ఉంటే మెంతులతో పాటు కొన్ని ఎండిపోయినా మల్లె పువ్వులు కలిపి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని గంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రు పోతుంది. దాంతో జుట్టు కూడా పట్టు కుచ్చులా పెరుగుతుంది.
మల్లె పువ్వుల రసం తీసి గులాబీ పువ్వుల రసం, గుడ్డులోని తెల్లసొనను 2 స్పూన్ల మోతాదులో కలిపి ముఖానికి రాస్తే ముఖం మృదువుగా కాంతివంతంగా మెరిసిపోతుంది. మల్లె పువ్వులతో విటమిన్ సి శరీరానికి కావలసిన ఉష్ణోగ్రతను అందిస్తుంది. మల్లె పువ్వులను ఫేస్‌ప్యాక్‌గా కూడా వాడుకోవచ్చును..
పావుకప్పు మల్లె పువ్వులను పేస్ట్‌గా చేసి అందులో కొద్దిగా పాలు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ బాగా ఆరిన తరువాత ముఖాన్ని ఓ 5 నిమిషాల పాటు మర్దన చేసుకుని ఆ తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వలన ముడతల చర్మం రాదు.