Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు ఐదుసార్లు గాలి బుడగలను ఊదితే ఏమవుతుందంటే?

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (21:26 IST)
మనం అందంగా కనిపించాలంటే మన ముఖం అందంగా, ఆకర్షణీయంగా ఉండాలి. మన ముఖానికి అందాన్ని ఇచ్చేవి మన బుగ్గలు. మనం తీసుకునే ఆహారం, మన దైనందిన జీవితం, మనం చేసే వ్యాయామాల మీద మన ముఖసౌందర్యం ఆధారపడి ఉంటుంది. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మన అందాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. రెండు స్పూన్ల రోజ్ వాటర్లో ఒకస్పూన్ గ్లిజరిన్‌ను కలిపి బుగ్గలకు రాయాలి. దీనిలో ఉన్న గ్లిజరిన్ చర్మంపై ఉన్న ముడతలను తగ్గించి చర్మం బిగుతుగా అయ్యేలా చేస్తుంది. ఇది బుగ్గలకు సహజ సిద్దమేన పోషణను ఇస్తుంది. 
 
2. రోజూ ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకొని బుగ్గలకు మర్ధన చేస్తే మంచి అందమైన బుగ్గలు మీ సొంతం అవుతాయి.
 
3. రోజూ స్నానానికి 15 నిమిషాల ముందు రెండు స్పూన్ల వెన్నలో ఒక స్పూన్ పంచదారను కలిపి ముఖానికి బాగా మర్ధన చేయాలి. తర్వాత  చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలాప్రతి రోజు క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
4. ప్రతి రోజు రెండు పూటలా రెండు గ్లాసుల పాలు త్రాగటం వలన మంచి ఫలితం ఉంటుంది.
 
5. రోజుకు 5 లేక 6 సార్లు బూరను ఊదటం వలన బుగ్గలకు మంచి వ్యాయామం జరుగుతుంది.
 
6. ఒక యాపిల్‌ను ముక్కలుగా కోసి మెత్తగా ఫేస్టులా చేయాలి.దీనిని బుగ్గలకు పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. యాపిల్‌లో ఉన్న కొల్లేజిన్ అనే ప్రోటీన్ చర్మం సాగే గుణాన్ని తగ్గించి సహజ సిద్ధమైన అందాన్ని ఇస్తుంది.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలను పక్కనబెట్టేయాల్సిందే.. సీఎం జగన్

కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ప్రథమ స్థానంలో ములుగు

కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ

భర్తను అన్నయ్య హత్య చేశాడు.. భార్య ఆత్మహత్య చేసుకుంది.. కారణం?

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments