పొట్టిగా ఉన్నవారు పొడుగ్గా కనిపించాలంటే...

చాలా మంది పొట్టిగా ఉంటారు. హై హీల్స్ వేస్తుంటారు. నిజానికి ఇలాంటి పాదరక్షలు వేస్తేనే సరిపోదనీ దుస్తుల ఎంపికలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుతున్నారు. అప్పుడే కొంతలో కొంత మార్పు తీసుకురావచ్చన్నది

Webdunia
ఆదివారం, 10 జూన్ 2018 (14:05 IST)
చాలా మంది పొట్టిగా ఉంటారు. హై హీల్స్ వేస్తుంటారు. నిజానికి ఇలాంటి పాదరక్షలు వేస్తేనే సరిపోదనీ దుస్తుల ఎంపికలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుతున్నారు. అప్పుడే కొంతలో కొంత మార్పు తీసుకురావచ్చన్నది వారి అభిప్రాయం. గీతలున్న దుస్తులను ధరించటంవల్ల కాస్త పొడుగ్గా కనిపిస్తారు. టాప్‌ డిజైన్‌లోని అల్లికలు కూడా నిలువుగా ఉంటే బావుంటుందని గమనించాలి.
 
సన్నటి నిలువు గీతలున్న టాప్‌ ధరించినప్పుడు పొడుగ్గా కన్నా వెడల్పుగా కనిపిస్తాం. అదే సమయంలో సన్నని అడ్డగీతలున్న దుస్తులు బట్ట అంతా ఉన్న వాటిని ధరిస్తేనే పొడుగ్గా కనిపిస్తారు. రెండు రంగులతో కాంట్రాస్ట్‌ రకాలను ఎంచుకోవడం పొరబాటు. దానివల్ల వాటి మధ్యనున్న తేడా అడ్డంగా ఓ గీతలా కనబడుతుంది. ఇది మరింత చిన్నగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి మీరు ధరించే డ్రెస్‌ రెండింటినీ ఈ తరహాల్లో ఎంచుకోకపోవడమే మంచిది. 
 
చిన్న పువ్వులు, ప్రింట్లు, తక్కువ అల్లికలు ఉన్న వస్త్రాలు మిమ్మల్ని మరింత ఎత్తుగా కనిపించేలా చేస్తాయి. ఇలాంటి డిజైన్లు, ఒకే రంగుల్లో ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. చీరలు ధరిస్తున్నప్పుడు పెద్ద పెద్ద అంచులున్నవి ఎంచుకోకూడదు. ఇక్కడా సన్న ప్రింట్లున్నవి, తక్కువ అంచున్న రకాలను ఎంచుకుంటే చూడముచ్చటగా ఉంటుంది. జీన్స్‌ లాంటివి కొంటున్నప్పుడు, ఏవో ఒకటి కాకుండా.. కఫ్డ్ రకాలను కొనడం మేలు. వీటివల్ల పొడుగ్గా కనిపిస్తారు. అప్పుడు హైహీల్స్‌ ధరిస్తే ఆ అందమే వేరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

తర్వాతి కథనం
Show comments