Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనే కదాని తేలికగా తీసుకునేరు..

తేనెలో ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా మేలు చేసే పోషకాలు పుష్కలంగా వున్నాయి. తేనెను పరగడుపున వేడినీటిలో కలుపుకుని తాగితే సులభంగా బరువు తగ్గుతారు. అలాగే తేనే చర్మ సౌందర్యాన్ని మరింత పెంపొందింపజేస్తుం

Webdunia
శనివారం, 29 సెప్టెంబరు 2018 (09:46 IST)
తేనెలో ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా మేలు చేసే పోషకాలు పుష్కలంగా వున్నాయి. తేనెను పరగడుపున వేడినీటిలో కలుపుకుని తాగితే సులభంగా బరువు తగ్గుతారు. అలాగే తేనే చర్మ సౌందర్యాన్ని మరింత పెంపొందింపజేస్తుంది. చెంచా పెరుగులో చెంచా తేనె కలిపి ముఖానికి పట్టించి.. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. తర్వాత చెంచా ఆలివ్ నూనెను రాసుకుంటే పొడిబారిన చర్మం మృదువుగా మారుతుంది. 
 
చెంచా తేనెకు రెండు చెంచాల పచ్చిపాలు కలిపి ముఖానికి రాసుకుని మృదువుగా మర్దనా చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే, ముఖం మెరుస్తుంది. మృతకణాలు తొలగిపోతాయి. రెండు చెంచాల పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఏడు నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ మిశ్రమం ముఖచర్మకణాల్లో ఉండే అధిక నూనెను తొలగిస్తుంది. 
 
చెంచా నిమ్మరసం, చెంచా పాలు, రెండు చెంచాల టొమాటో గుజ్జు కలిపి ముఖానికి పట్టించి పదినిమిషాల తరువాత చల్లనినీటితో కడిగేయాలి. మృతకణాలు పోయి చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుందని బ్యూటీషియన్లు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments