Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు, గంధం పొడితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (11:56 IST)
ఎండ వేడి కారణంగా చర్మం, శిరోజాలు సౌందర్యం తగ్గుతుంది. నవనవలాడే చర్మం రంగు మారి ముడతలు పడుతుంది. మెరిసే కురులు బిరుసెక్కి రాలిపోతూ ఉంటాయి. ఈ సౌందర్య సమస్యలకు చెక్ పెట్టాలంటే వేసవిలో కొన్ని బ్యూటీ చిట్కాలు పాటించాలని చెప్తున్నారు. 
 
పెరుగులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. తరచు చర్మం పొడిబారుతుంటే.. పెరుగులో కొద్దిగా గంధం పొడి, టమోటా రసం కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని అరగంటపాటు అలానే ఉండాలి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తే ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది.
 
ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఫేసియల్ బ్లాటింగ్ పేపర్, సన్‌స్క్రీన్ లోషన్, వెట్‌వైప్స్, లిప్‌బామ్‌లో పర్సులో వెంట తీసుకెళ్లాలి. వేడికి చర్మం జిడ్డుగా తయారైతే బ్లాటింగ్ పేపర్ అద్దుకోవాలి. ప్రతి నాలుగు గంటలకోసారి సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. అలానే పెదవులు పొడిబారకుండా లిప్‌బామ్ అప్లై చేయాలి. 
 
ముఖాన్ని శుభ్రం చేసుకోవాలంటే.. మైల్డ్ క్లీన్సర్‌తో రోజుకు కనీసం 4 సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మృతకణాలు, సన్‌ట్యాన్ తొలగిపోతాయి. ఈ ఎక్స్‌ఫాలియేట్ వలన చర్మం తాజాగా తయారవుతుంది.    

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ఆవు - పాము స్నేహం.. నెట్టింట వీడియో వైరల్

శ్రీతేజ్‌ మెదడుకు డ్యామేజీ జరిగిందంటున్న వైద్యులు.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

తర్వాతి కథనం
Show comments