కొబ్బరి నూనెలో కరివేపాకులు నానబెట్టి ఇలా చేస్తే..?

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (11:26 IST)
ఈ కాలంలో చాలామందికి జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అందుకు ఏం చేసినా కూడా ఎలాంటి లాభాలు కనిపించలేదని బాధపడుతున్నారు. బయట దొరికే పదార్థాలకంటే ఇంట్లోని చిట్కాలు పాటిస్తే కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..
 
1. జుట్టు రాలకుండా ఉండాలంటే.. తడిగా ఉన్నప్పుడు దువ్వితే వెంట్రుకలు తెగిపోయే అవకాశం ఉంది. కాబట్టి తడి పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వుకోవాలి. 
 
2. టవల్‌తో వెంట్రుకలను సున్నితంగా తుడిచి ఆరబెట్టాలి. గట్టిగా రుద్దితే వెంట్రుకలు తెగిపోతాయి. దువ్వెలను ఎప్పటికప్పుడూ శుభ్రం చేస్తూ ఉండాలి. లేదంటే దాన్లో ఇరుక్కున్న మట్టి వల్ల వెంట్రుకలు ఊడే సమస్య తలెత్తవచ్చు. 
 
3. తరచు తలకు నూనె రాస్తుండాలి. వారానికోసారి హాట్ ఆయిల్ ట్రీట్‌మెంట్ చేయాలి. ఇందుకోసం కొబ్బరినూనెను వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే కుదుళ్లకు పట్టించి మసాజ్ చేయాలి. ఇలా చేస్తే వెంట్రుకల కుదుళ్లను ఆరోగ్యంగా ఉంటాయి.
 
4. కప్పు కొబ్బరినూనెను వేడి చేసుకుని అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసి కాసేపు అలానే ఉంచాలి. ఈ నూనెను తరచు తలకు పట్టిస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. 
 
5. మెంతులు పేస్ట్ చేసి అందులో పావుకప్పు పెరుగు కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి జుట్టుకు రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేరళలో బస్సులో లైంగిక వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య.. కార్డ్‌బోర్డ్‌లతో పురుషుల ప్రయాణం (video)

ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు.. జనసేనకు, బీజేపీకి ఎన్ని స్థానాలు?

ఏపీలో పెరిగిన భూముల ధరలు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

తొమ్మిది తులాల బంగారు గొలుసు... అపార్ట్‌మెంట్‌కు వెళ్లి వృద్ధురాలి వద్ద దోచుకున్నారు..

ఛీ..ఛీ.. ఇదేం పాడుపని.. మహిళల లోదుస్తులను దొంగిలించిన టెక్కీ.. ఎందుకంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుక్కకు తులాభారం, ప్లీజ్ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి: నటి టీనా శ్రావ్య (video)

జై హో పాటపై ఆర్జీవీ కామెంట్లు.. ఏఆర్ రెహ్మాన్‌ వ్యాఖ్యలపై వర్మ ఎండ్ కార్డ్

Chiranjeevi: మళ్ళీ మన శంకర వరప్రసాద్ టికెట్ ధరలు పెరగనున్నాయా?

Naveen Chandra: సైకలాజికల్ హారర్ గా నవీన్ చంద్ర మూవీ హనీ తెరకెక్కుతోంది

Rajiv Kanakala: ఏ స్వీట్ రైవల్రీ తో ఆత్రేయపురం బ్రదర్స్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments