జుట్టు పోషణకు పొన్నగంటి కూర..

జుట్టు పోషణకు పొన్నగంటి కూర ఎంతో మేలు చేస్తుంది. ఒక కప్పు పొన్నగంటి కూర, ఒక కప్పు గోరింటాకు పొడి, రెండు చెంచాల మెంతిపొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మ

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (13:30 IST)
జుట్టు పోషణకు పొన్నగంటి కూర ఎంతో మేలు చేస్తుంది. ఒక కప్పు పొన్నగంటి కూర, ఒక కప్పు గోరింటాకు పొడి, రెండు చెంచాల మెంతిపొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 20 నిమిషాల సేపు ఉంచాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం వుంటుంది. 
 
చుక్కకూర ఒక కప్పు, గోరింటాకు పొడి, రెండు స్పూన్‌ల ముల్తాన్ మట్టి, కప్పు పెరుగు కలిపి పేస్టు తయారు చేసుకోవాలి. దానిని తలకు బాగా పట్టించి 20 నిమిషాల సేపు ఉంచాలి. దీనివల్ల జుట్టు నిగనిగలాడుతుంది. 
 
ఇంకా కొద్దిగా మజ్జిగలో చింత చిగురు, కప్పు గోరింటాకు పొడి, అరకప్పు శనగపిండి కలపాలి. తలకు బాగా నూనె రాసుకుని ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి. ఇది జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది.
 
అలాగే ఉల్లిపాయలను మెత్తగా దంచి పలుచని నూలుబట్టలో వేసి రసం తీసి వారానికి రెండు సార్లు తలకు సున్నితంగా మర్దనా చేస్తుంటే తలలో మాటి మాటికీ వెంట్రుకలు ఊడడం ఆగిపోవడమే కాక కుదుళ్లు కూడా గట్టిపడతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిస్టర్ జగన్... రివర్ బెడ్‌కు రివర్ బేసిన్‌కు తేడా తెలుసుకో : మంత్రి నారాయణ

సంక్రాంతి పండుగ: హైదరాబాదుకు భారీగా ప్రజలు.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్... వసూళ్లు వద్దు

సీడీఎస్‌సీఓ వార్నింగ్: తెలంగాణలో ఆల్మాంట్-కిడ్ సిరప్‌పై నిషేధం

నాతో పడుకుంటే ఆ డబ్బు ఇస్తా, వివాహిత నిలదీసినందుకు చంపేసాడు

కాంగ్రెస్ మహిళా నేతపై ఫైర్ అయిన గాయని చిన్మయి.. మహిళల దుస్తులే కారణమా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజా సాబ్ మూవీ రిజల్ట్ పట్ల మేమంతా హ్యాపీగా ఉన్నాం :టీజీ విశ్వప్రసాద్, మారుతి

Chiru: నేను సినిమా టికెట్ హైక్ ఇవ్వలేదు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Rana: అవాస్తవ, తప్పుదారి పట్టించే వార్తా కథనాన్ని ఖండించిన డి. సురేష్ బాబు

Prabhas Old getup: రాజాసాబ్ లో ప్రభాస్ ను ఓల్డ్ గెటప్ చూపిస్తున్నాం : మారుతీ

వామ్మో.. 'ది రాజాసాబ్‌'కు మరో 8 నిమిషాల సన్నివేశాలు జోడింపా?

తర్వాతి కథనం
Show comments