ద్రాక్ష పండ్ల గుజ్జుకు ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి..

తియ్యగా పుల్లగా ఉండే ద్రాక్షతో ఆరోగ్యానికి మేలు జరగడంతో పాటు సౌందర్యం కూడా మీ సొంతం అవుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి నిగారింపును సంతరించుకునేలా చేస్తాయి. యాంటీ-ఏజింగ్ లక్షణాలను దూరం చేస

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2017 (13:15 IST)
తియ్యగా పుల్లగా ఉండే ద్రాక్షతో ఆరోగ్యానికి మేలు జరగడంతో పాటు సౌందర్యం కూడా మీ సొంతం అవుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి నిగారింపును సంతరించుకునేలా చేస్తాయి. యాంటీ-ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయి. చర్మం మిల మిలా మెరిసి పోవాలంటే వారానికోసారి ద్రాక్ష పండ్లతో ప్యాక్ వేసుకోవాలని బ్యూటీషన్లు చెప్తున్నారు.. 
 
ద్రాక్ష పండ్ల గుజ్జుకు ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి, పట్టించి కాసేపయ్యాక కడిగేసుకుంటే జిడ్డు దూరమై చర్మం కాంతిమంతం అవుతుంది. పొడిచర్మం సమస్యతో బాధపడేవారు గుడ్డులోని తెల్లసొనకు, ద్రాక్ష పండ్ల రసాన్ని కలిపి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది. కళ్ల చుట్టూ ముడతలు వస్తున్నప్పుడు ద్రాక్ష పండ్లతో వాటిని దూరం చేసుకోవచ్చు. ద్రాక్షను రెండు ముక్కలుగా చేసుకుని కంటి చుట్టూ కొన్ని క్షణాలు రాయాలి. ఇలా తరచూ చేస్తే ముడతలు తగ్గిపోతాయి.
 
ఐదు స్పూన్ల పెరుగుకి, మూడు స్పూన్ల ద్రాక్ష రసం, ఒక స్పూను నారింజ రసం కలిపి ముఖానికి ఫేస్‌మాస్క్‌లా వేసుకోవచ్చు. ఇది వయసు పైబడిన ప్రభావం కనిపించనివ్వకుండా చర్మాన్ని తాజాగా ఉంచుతుందని బ్యూటీషన్లు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాలువలో శవమై తేలిన యువ గాయని... ఎవరు?

పూణెలో దారుణం : కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లనుంది : రాహుల్ గాంధీ

అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్త - పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య - అత్త

ప్రభుత్వ ఉద్యోగాలు.. వయోపరిమితిని 44కి పెంచనున్న తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిష కృష్ణన్‌ బ్యూటీ సీక్రెట్ అదే.. చీరలంటే ఆమెకు చాలా ఇష్టం

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

Yash: టాక్సిస్ సెట్ నుండి రాయ గా యష్ లుక్

నారా లోకేష్‌కు ఎక్కువ మంది పిల్లలు వుండాలని భావిద్దాం, బావ ఫోటో పెట్టావు: పూనమ్ కౌర్ ట్వీట్

Yash: టాక్సిక్ సెట్ నుండి రాయా గా అద్భుతమైన స్టిల్‌ తో యష్

తర్వాతి కథనం
Show comments