Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యానికి చిట్కాలు... తప్పక తెలుసుకోవాల్సినవి....

కూరగాయలు తరిగేటప్పుడు చేతులు తెగటం దాదాపుగా అందరికీ జరుగుతుంది. తెగిన వెంటనే గాయానికి పసుపు అద్దితే గాయం త్వరగా మానుతుంది. సెప్టిక్ కాదు. కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు మాయమవుతాయి

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (21:57 IST)
కూరగాయలు తరిగేటప్పుడు చేతులు తెగటం దాదాపుగా అందరికీ జరుగుతుంది. తెగిన వెంటనే గాయానికి పసుపు అద్దితే గాయం త్వరగా మానుతుంది. సెప్టిక్ కాదు. కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు మాయమవుతాయి.
 
కొందరికి కళ్ల చుట్టూ ముడతలు వస్తుంటాయి. బహుశా కళ్ల సమస్య ఉండి కూడా రావచ్చు. కనుక డాక్టరు సూచించిన మేరకు రీడింగ్‌ గ్లాసు వాడకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. డాక్టరు సలహాను అనుసరించి కళ్లను అధిక శ్రమకు గురిచేయకుండా జాగ్రత్త తీసుకోవాలి.
 
క్రమం తప్పకుండా ధనియాలు వాడుతుంటే అధిక రుతుస్రావం ఆగుతుంది. క్రమం తప్పకుండా సోయాబీన్ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు చేరవు. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్‌ను కరిగించి వేస్తుంది.
 
గర్భిణీలకు ఉదయాన్నే కాని, మరికొందరిలో ఏం తిన్నా కూడా వెంటనే వాంతులవడాన్ని చూస్తుంటాం. పరగడుపున ఒక టేబుల్‌ స్పూను తేనెలో అంతే మోతాదు నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే వాంతులు ఆగిపోతాయి. తిన్నది కడుపులో ఇముడుతుంది. 
 
గాయాల నుంచి రక్తం కారుతుంటే చందనం పొడిలో కొద్దిగా నీటిని కలిపి పేస్టులా చేసుకుని గాయానికి రాయాలి. గజ్జి, తామర వంటివి బాధిస్తుంటే ఒక టీ స్పూను మిరియాల పొడిలో ఒక టీ స్పూను నెయ్యి కలిపి రోజుకి మూడుసార్లు చొప్పున తీసుకుంటే తగ్గిపోతుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments