వెల్లుల్లి రసాన్ని కలబంద గుజ్జులో కలిపి అక్కడ రాసుకుంటే?

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (21:57 IST)
కొంతమందిలో ముఖం ఎంత అందంగా ఉన్నప్పటికి మొటిమల సమస్య వేదిస్తుంటుంది. ఈ సమస్యకు చాలా రకాల క్రీంలు వాడినప్పటికి ఉపశమనం లభించదు. ప్రకృతి ప్రసాదించిన వెల్లుల్లి మొటిమలకు గొప్ప నివారణా మార్గంగా ఉంది. వెల్లుల్లి, బాక్టీరియాను చంపడానికి సహాయపడే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు క్రిమినాశక తత్వాలను కలిగి ఉంటుంది. అలాగే, వెల్లుల్లిలో ఉన్న సల్ఫర్ సమ్మేళనాలు పొడిబారేందుకు ఏజెంట్ వలె పనిచేస్తాయి, క్రమంగా మొటిమలను తొలగించడంలో సహాయపడుతుంది. 
 
1. వెల్లుల్లి రెబ్బలను మిక్స్ చేసి, అందులో వెనిగర్ కలిపి, మిశ్రమంగా పేస్టులా వచ్చే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాయాలి. ఈ మిశ్రమాన్ని ఒక కాటన్ బాల్‌తో అప్లై చేసుకోవచ్చు. ముఖం మీది మిశ్రమం పూర్తిగా ఆరిపోయే వరకు వదిలివేయండి, పొడిబారిన తర్వాత ముఖాన్ని స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేయండి. ఉత్తమ ఫలితాల కోసం ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు.
 
2. అలోవేరా, చర్మాన్ని చికాకు, వాపు, మొటిమల బారినుండి రక్షించడంలో, మరియు పూర్తిస్థాయిలో నివారించేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా, ముఖం మీద డార్క్ సర్కిల్స్, మృత కణాలను తొలగించడంలో మంచి ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
 
3. వెల్లుల్లిని చిదిమి, దాని నుండి రసాన్ని వేరు చేయండి. దీనిని ఒక శుభ్రమైన గిన్నెలోకి తీసుకుని అందులో, తాజా కలబంద గుజ్జును జోడించి కలపండి. మొటిమలు మీద రాసి 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే వదిలివేయండి. తర్వాత సాధారణ నీటితో శుభ్రపరచండి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.
 
4. ఎగ్ వైట్లో, చర్మం మీద మృతకణాలను తొలగించడంలో, క్రమంగా రంధ్రాలను పూడ్చడంలో సహాయపడే ప్రోటీన్లు మరియు పోషకాలతో నిండి ఉంటాయి. ఒక గిన్నెలో, గుడ్డు నుండి తెల్ల సొనను వేరు చేసి తీసుకోండి. వెల్లుల్లి పేస్ట్, తెల్ల గుడ్డు  మిశ్రమంలా కలపండి. మొటిమల ఉన్నచోట ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి.. కొన్ని నిమిషాల పాటు పొడిగా మారే వరకు అలాగే వదిలివేయండి. పూర్తిగా పొడిబారాక, సాధారణ నీటితో కడిగివేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

భోగి పండుగ - పొంగలి తయారు చేసిన ప్రధాని మోడీ

కారుతో బీభత్సం కేసు : రౌడీ షీటర్లకు ఖాకీ మార్క్ ట్రీట్మెంట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

నారీ నారీ నడుమ మురారి టికెట్లు ఎంఆర్‌పీ ధరలకే : నిర్మాత అనిల్ సుంకర

తర్వాతి కథనం
Show comments