Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరింటాకు ఫేస్‌ప్యాక్..?

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (11:15 IST)
మిలమిలలాడే తాజాదనంతో మెరిసే చర్మాన్ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అయితే దీనికోసం బ్యూటీపార్లర్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే గోరింటాకు ప్యాక్ వేసుకున్నట్లయితే కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది. ఈ ప్యాక్‌ను సులభంగా వేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
 
గోరింటాకు ప్యాక్:
గోరింటాకులను పొడిచేసుకుని అందులో కొద్దిగా గుడ్డు తెల్లసొన, నీరు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ముఖానికి సరిపోయేంత శుభ్రమైన కాటన్ వస్త్రాన్ని తీసుకుని ముఖాన్ని తుడుచుకోవాలి. రెండు నిమిషాలు ఆగి దాన్ని తీసేయాలి. ఇలా రెండుసార్లు చేయాలి. ఇలా చేస్తే చర్మం చాలా కోమలంగా తయారవుతుంది.
 
లేత గోరింటాకులతో నూరిన రెండు టీస్పూన్ల రసానికి అంతే మోతాదులో పాలు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి 5 నిమిషాలపాటు మర్దనా చేయాలి. గోరింటాకు కేశ సౌందర్యానికి కాకుండా, చర్మానికి కూడా చాలా మేలు చేస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. అయితే లేత గోరింటాకును మాత్రమే ప్యాక్ వేసుకునేందుకు వాడాలన్న విషయాన్ని మాత్రం మరచిపోవద్దు.
 
చివరగా... గుడ్డులో ఒక చెంచా తేనెను కలిపి ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. అలాగే 10 నిమిషాలు ఉంచిన తరువాత కడిగేయాలి. అయితే, జిడ్డు చర్మతత్వం కలిగిన వారు పచ్చసొన వాడకూడదు. గుడ్డు సంపూర్ణ ఆహారంలో భాగమన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా, గుడ్డులోని లెసిలిన్ చర్మానికి చాలా మంచిది. ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచి, ముడతలు రాకుండా కాపాడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

కానిస్టేబుల్ కర్కశం... కన్నతల్లిని కొట్టి చంపేశాడు..

ప్రధాని మోడీ భద్రతా వలయంలో లేడీ కమాండో...!!

బాలానగర్ సీతాఫలంకు భౌగోళిక గుర్తింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments