ముడతల చర్మానికి బ్యూటీ చిట్కాలు...

బొప్పాయి సహజ పీలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. మెుటిమలు, మచ్చల్ని తొలగించుటలో చాలా సహాయపడుతుంది. బొప్పాయి పండును గుజ్జుగా చేసుకుని అందులో తేనె, పెరుగు కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పూతలా వేసుకోవాలి.

Webdunia
సోమవారం, 23 జులై 2018 (17:29 IST)
బొప్పాయి సహజ పీలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. మెుటిమలు, మచ్చల్ని తొలగించుటలో చాలా సహాయపడుతుంది. బొప్పాయి పండును గుజ్జుగా చేసుకుని అందులో తేనె, పెరుగు కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పూతలా వేసుకోవాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకుంటే మచ్చల్లేని చర్మం మీ సొంతమవుతుంది.
 
ఎక్కువగా బయట తిరగడం వలన చర్మంపై మురికి చేరుతుంది. అలాకాకుండా ఉండాలంటే టమోట గుజ్జులో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకుని సున్నితంగా మర్దన చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చర్మం తాజాగా మారుతుంది. ముడతలు చర్మాన్ని కాంతి విహీనంగా మారుస్తుంది. బొప్పాయి గుజ్జులో కొద్దిగా బియ్యప్పిండిని కలుపుకోవాలి.
 
ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ముడతలు చర్మం తగ్గి చర్మం బిగుతుగా మారుతుంది. రెండు స్పూన్స్ తేనెలో కొద్దిగా కోడిగుడ్డు సొనను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వలన మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.
 
బంగాళాదుంప గుజ్జులో రెండు చెంచాల ఓట్స్, రెండు చెంచాల పాలు, తేనె, ఆలివ్ నూనెను కలుపుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీ ముఖం మృదువుగా, అందంగా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments