Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పొద్దు తిరుగుడు విత్తనాలతో ఆస్తమా వ్యాధికి చెక్....

పొద్దు తిరుగుడు విత్తనాల నుండి తీసే నూనెను నిత్యం వంటల కోసం వాడుతుంటాం. ఈ నూనె కన్నా పొద్దు తిరుగుడు విత్తనాలే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. శరీరానికి కావలసిన పోషకాలను అందించడంలో, పలు అనారోగ్య

Advertiesment
పొద్దు తిరుగుడు విత్తనాలతో ఆస్తమా వ్యాధికి చెక్....
, సోమవారం, 23 జులై 2018 (10:45 IST)
పొద్దు తిరుగుడు విత్తనాల నుండి తీసే నూనెను నిత్యం వంటల కోసం వాడుతుంటాం. ఈ నూనె కన్నా పొద్దు తిరుగుడు విత్తనాలే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. శరీరానికి కావలసిన పోషకాలను అందించడంలో, పలు అనారోగ్య సమస్యలను తొలగించడంలో పొద్దు తిరుగుడు విత్తనాలు చాలా దోహదపడుతాయి.
 
ఈ విత్తనాలలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. శరీరంలోని కొవ్వును కరిగించుటలో సహాయపడుతాయి. అధిక బరువును తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. కీళ్లనొప్పులు, ఆస్తమా వంటి సమస్యలు నుండి విముక్తి చెందవచ్చును. డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్ వ్యాధిని మెరుగుపరుస్తుంది.
 
గుండె ఆరోగ్యానికి ఈ పొద్దు తిరుగుడు విత్తనాలు చాలా సహాయపడుతాయి. ఎముకల బలానికి మంచి ఔషధం. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. ఈ గింజల్లో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. తలనొప్పికి ఈ విత్తనాలు చాలా ఉపయోగపడుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతిరోజూ యాపిల్ పండును తీసుకుంటే?