Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్ల చుట్టూ నల్లని వలయాలు... పోగెట్టేదెలా?

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (21:03 IST)
ముఖంలో ఎక్కువగా ఆకర్షించేవి కళ్లు. ఆ కళ్లు అందంగా లేకుండా, కళ్ల కింద ఉబ్బినట్లుగా, నలుపుగా ఉంటే అసహ్యంగా ఉంటుంది. వీటిని నివారించుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేమిటో చూద్దాం.
 
1. కొన్ని బాదం పప్పులని బాగా నానబెట్టి మెత్తని పేస్టులా చేయాలి. అందులో కొంచెం పాలు కలిపి రాత్రి పడుకునే ముందు కంటి చుట్టూ రాసుకోవాలి. ఉదయాన్నే నిద్ర లేవగానే చన్నీళ్లతో కడిగేసుకోవాలి.
 
2. అధిక ఒత్తిడి, అలసట వల్ల కళ్ల కింద ప్రాంతం వాచినట్లు అవుతుంది. అది పోవాలంటే... వాడేసిన టీ బ్యాగులను బాగా చన్నీళ్లలో ముంచి ఆ వాపు ప్రాంతంలో పెట్టుకుంటే వాపు తగ్గిపోతుంది. వీటన్నింటికన్నా ముఖ్యంగా సరిపడినంత నిద్ర, పోషకాహారం ఉంటే కళ్లు మిలమిల మెరుస్తాయి.
 
3. కీరదోస రసం కళ్లకి చాలా మంచిది. అది చర్మానికి మంచి టోనర్‌గా కూడా పని చేస్తుంది. కీరదోస రసంలో దూదిని ముంచి కనురెప్పలపై పెట్టుకోవాలి. కొంచెం రసాన్ని కళ్ల కింద భాగంలో రాసుకోవాలి. ఇలా తరచూ చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.
 
4. టొమాటో గుజ్జుకి కొంచెం నిమ్మరసం, చిటికెడు శనగపిండి, పసుపు కలిపి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ రాసుకుని పది నిమిషముల పాటు వదిలేయాలి. రోజుకొకసారైనా ఇలా చేస్తుంటే కళ్ల చుట్టూ ఉండే నల్లని వలయాలు త్వరగా తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిత్రుడు నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments