Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చర్మాన్ని కాపాడే స్ట్రాబెర్రీ.. ఎలాగంటే?

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (19:33 IST)
వేసవిలో చర్మానికి స్ట్రాబెర్రీ సూపర్ టానిక్‌లా ఉపయోగపడుతుంది. రోజుకు రెండేసి స్ట్రాబెర్రీలు తింటే ఎండాకాలంలో ఏర్పడే చర్మ సమస్యలుండవు. అలాగే ఎండాకాలంలో చాలామంది చర్మం పొడిబారిపోతుంటుంది. పొడిబారిన చర్మానికి, జిడ్డు చర్మానికి స్ట్రాబెర్రీ ద్వారా చెక్ పెట్టొచ్చు. దాని కోసం స్ట్రాబెర్రీ ముక్కలను పెరుగు మీగడతో కలిపి మిక్స్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఎక్కడైతే పొడిబారిపోయిన చర్మం ఉంటుందో అక్కడ రుద్దాలి.
 
జిడ్డు చర్మం ఉంటే.. పెరుగు, స్ట్రాబెర్రీ ముక్కలను కలిపి మిక్స్ చేసి.. ఆ మిశ్రమాన్ని రుద్దాలి. ఓ పది నిమిషాలు ఆగి.. తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇలా రోజూ చేస్తే ముఖం మీద ఉన్న మొటిమలు కూడా మాయమయిపోతాయి.
 
చాలామందికి ఎండాకాలం ముఖం చర్మం కందిపోతుంది. ఎర్రగా మారుతుంది. అటువంటి వాళ్లు స్ట్రాబెర్రీ, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే ఆ కురుపులు మటుమాయమవుతాయి. స్ట్రాబెర్రీ గుజ్జును తీసుకొని కోకోవా పౌడర్, తేనే కలిపి దాన్ని ముఖానికి పెట్టుకుంటే చర్మం కాంతివంతం అవుతుంది. బియ్యం పిండిలో స్ట్రాబెర్రీ గుజ్జును కలిపి.. దాన్ని ఫేస్ ప్యాక్‌లాగానూ వాడుకోవచ్చు. ముఖానికి రుద్దుకొని కాసేపు ఆగి కడుక్కుంటే చర్మం నిగనిగలాడుతుంది.

సంబంధిత వార్తలు

మీడియాలో వాయిస్ లేనోళ్లంతా జగన్‌కే ఓటు, భారీ మెజారిటీ: రాజు రవితేజ

ట్రోల్స్ ధాటికి టెక్కీ ఆత్మహత్య.. ఏమైంది.. ఎక్కడ?

గుజరాత్‌లో నవ వధువును కిడ్నాప్ చేసిన సాయుధ దుండగులు!!

మహిళ కడుపులో 570 రాళ్లు: షాక్ అయిన డాక్టర్లు

తప్పు చేయనపుడు భయపడొద్దు.. స్వదేశానికి వచ్చెయ్.. ప్రజ్వల్‌కు వినతి

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

తర్వాతి కథనం
Show comments