Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు, పసుపు, బీట్‌రూట్ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

బీట్‌రూట్‌లో సౌందర్యానికి వన్నె తెచ్చే ఎన్నో గుణాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూట్ గుజ్జులో నాలుగు చుక్కల బాదం నూనె, చెంచా ఆలివ్‌ నూనె వేసి ముఖానికి మర్దన చేసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేసుకుం

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (11:47 IST)
బీట్‌రూట్‌లో సౌందర్యానికి వన్నె తెచ్చే ఎన్నో గుణాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూట్ గుజ్జులో నాలుగు చుక్కల బాదం నూనె, చెంచా ఆలివ్‌ నూనె వేసి ముఖానికి మర్దన చేసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేసుకుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అలాగే అరకప్పు పెరుగులో చిటికెడు పసుపూ, కొద్దిగా బీట్‌రూట్‌ గుజ్జు కలిపి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక శుభ్రం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. చర్మం కాంతిమంతమవుతుంది. 
 
బీట్‌రూట్‌ గుజ్జులో రెండు చెంచాల ముల్తానీ మట్టీ, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలూ, నల్లమచ్చలూ దూరమవుతాయి. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. 
 
బీట్‌రూట్‌ రసం, కమలా రసం సమపాళ్లలో తీసుకుని అందులో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం చర్మకణాలను శుభ్రం చేస్తుంది. అదే బీట్‌రూట్‌ రసంలో నిమ్మరసం కలిపి రాసుకుంటే పిగ్మెంటేషన్‌ సమస్య దూరమవుతుందని బ్యూటీషన్లు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments