Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతాన లేమికి చెక్ పెట్టే ద్రాక్షరసం ఎలా చేయాలి?

సంతానం లేదని బాధపడుతున్నారా? డోంట్ వర్రీ. కంటినిండా నిద్రపోవడం, వీలైనంత ఎక్కువగా ద్రాక్ష పండ్లు తినడం ద్వారా కడుపు పండేందుకు అవకాశాలు మెరుగవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. విపరీతమైన కడుపునొప్పి, నె

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (11:36 IST)
సంతానం లేదని బాధపడుతున్నారా? డోంట్ వర్రీ. కంటినిండా నిద్రపోవడం, వీలైనంత ఎక్కువగా ద్రాక్ష పండ్లు తినడం ద్వారా కడుపు పండేందుకు అవకాశాలు మెరుగవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. విపరీతమైన కడుపునొప్పి, నెలసరి సక్రమంగా లేకపోవడం ద్వారా సంతాన లేమి ఏర్పడుతుంది. ఈ సమస్యలను దూరం చేయాలంటే.. నల్ల ద్రాక్షల రసం లేదా.. ద్రాక్ష పండ్లను తీసుకోవాలి. 
 
ద్రాక్ష పండ్లతోపాటు బ్లూబెర్రీలు, వేరుశనగలోనూ ఉండే యాంటీ యాక్సిడెంట్ రిస్‌వెరట్రాల్, మంచి నిద్రతో శరీరానికి చేరే మెలటోనిన్‌లతో సంతానలేమిని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ద్రాక్ష పండ్ల ద్వారా తయారయ్యే జ్యూస్‌ను రోజూ ఒక గ్లాసుడు తాగితే ఈ సమస్యలను చెక్ పెట్టవచ్చునని వారు చెప్తున్నారు. 
 
ఆరోగ్య ప్రయోజనాలనిచ్చే ద్రాక్షరసాన్ని ఎలా చేయాలంటే..?
కావలసిన పదార్థాలు : 
ద్రాక్షరసం- రెండు కప్పులు,
యాలకులు: రెండు, 
చల్లనినీళ్లు: 2 కప్పులు
లవంగాలు: రెండు, 
దాల్చినచెక్క: అరఅంగుళంముక్క, 
శొంఠిపొడి: పావుటీస్పూను, 
తేనె: 3 టేబుల్‌స్పూన్లు,
 
తయారుచేసే విధానం: 
ముందుగా యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు ఓసారి వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. జ్యూసర్‌లో మృదువుగా చేసిన ద్రాక్షరసంలో శొంఠిపొడి, మసాలాలపొడి వేసి మళ్లీ ఓసారి తిప్పాలి. తరవాత చల్లని నీళ్లు పోసి, తేనె కలిపి సర్వ్ చేయాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments