Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం, నువ్వులు సమాన భాగాలుగా తీసుకుని రాత్రంతా నానబెట్టి....

Webdunia
గురువారం, 4 జులై 2019 (20:31 IST)
సాధారణంగా మన చర్మం రంగు ఎరుపా, చామనఛాయ అన్న విషయంతో సంబంధం లేకుండా అది ప్రకాశవంతంగా మెరుస్తుంటే చూసేకొద్దీ చూడాలని అనిపిస్తుంటుంది. అందుకే మనం చంర్మం మెరుపుని సంతరించుకోవడానికి అనేక రకములైన కాస్మోటిక్స్ వాడుతుంటాము. అలా చేయడం వలన సున్నితమైన చర్మం పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాకాకుండా సహజసిద్దంగా లభించే పదార్దాలతో కొన్ని చిట్కాల ద్వారా మన చర్మాన్ని ప్రకాశవంతంగా చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. బియ్యం, నువ్వులు సమాన భాగాలుగా తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. తరువాత రెండింటిని మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషముల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మం తేమని సంతరించుకుని అందంగా మెరుస్తుంటుంది.
 
2. ముఖాన్ని శుభ్రంగా కడిగి తేనె, ముల్తానా మట్టి కలిపిన మిశ్రమాన్ని పట్టించి పావుగంట తరువాత కొద్దిగా నీళ్లు తీసుకుని మెల్లగా మర్దనా చేస్తూ రుద్ది కడిగేయాలి. ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే క్రమంగా చర్మం మెరుపుని సంతరించుకుంటుంది.
 
3. కొవ్వు తక్కువగా ఉన్న పాలను తీసుకుని వాటిని ముఖానికి పలుచని పూతలా వేసి చర్మంలో కలిసిపోయేలా మృదువుగా మర్దనా చేయాలి. పది నిమిషముల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖం మీద ఉన్న మచ్చలన్నీ తొలగిపోయి ముఖం మృదువుగా ఉండి మెరుస్తుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మా ఇల్లు బఫర్‍‌జోన్‌లో ఉందా... హైడ్రా కమిషనర్ క్లారిటీ!!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

తర్వాతి కథనం
Show comments