Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మరసంలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

ఈ కాలంలో చర్మం ఎలాంటి పరిస్థితులలో ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. చర్మం ఎక్కువగా పగులుతూ ఉంటుంది. దీంతో చర్మం తెల్లగా పేలినట్లు మారుతుంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించాలంటే అందుకు రసాయనాలు కలిసిన క్రీమ

Webdunia
మంగళవారం, 14 ఆగస్టు 2018 (15:00 IST)
ఈ కాలంలో చర్మం ఎలాంటి పరిస్థితులలో ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. చర్మం ఎక్కువగా పగులుతూ ఉంటుంది. దీంతో చర్మం తెల్లగా పేలినట్లు మారుతుంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించాలంటే అందుకు రసాయనాలు కలిసిన క్రీమ్‌లను, ఇతర పౌడర్లను వాడకూడదు. అందుకు నిదర్శనంగా ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే చర్మాన్ని, ముఖాన్ని సంరక్షించుకోవచ్చును. మరి అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
 
నిమ్మరసంలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. నిమ్మరసంలో కొద్దిగా శెనగపిండి, చిటికెడు పసుపును కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని 20 నిమిషాల తరువాత తలస్నానం చేస్తే చక్కని ఫలితాలను పొందవచ్చును.
 
స్నానానికి ముందు టమోటా రసాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారతుంది. రాత్రి పడుకునే ముందుగా ముఖానికి పాలు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మ సౌందర్యాన్ని పరిరక్షించేందుకు చక్కగా తోడ్పడుతుంది. 
 
చందనపు పొడిలో కొద్దిగా రోజ్ వాటర్‌ను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వలన కూడా ముఖచర్మం కాంతివంతంగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments