Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటిపండుతో ఫేషియల్ పాక్...

ప్రస్తుతం అరటిపండు మనకు సహజ సిద్ధంగా లభించే పండు. ఇందులో అనేక రకాల పోషక విలువలున్నాయి. ఇలాంటి అరటి పండుతో ఫేషియల్ చేసుకుంటే మీ ముఖారవిందం ఎంతో అందంగా తయారవుతుంది. ఈ అరటిపండును ఎలా ఫేషియల్ ప్యాక్‌లా వే

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (17:34 IST)
ప్రస్తుతం అరటిపండు మనకు సహజ సిద్ధంగా లభించే పండు. ఇందులో అనేక రకాల పోషక విలువలున్నాయి. ఇలాంటి అరటి పండుతో ఫేషియల్ చేసుకుంటే మీ ముఖారవిందం ఎంతో అందంగా తయారవుతుంది. ఈ అరటిపండును ఎలా ఫేషియల్ ప్యాక్‌లా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
మీది జిడ్డు చర్మం అయినా, ముఖం మీద నల్లటి మచ్చలు ఉన్నా 3 నిమిషాలు పాటు ఫేషియల్ స్టీమ్ తీసుకుంటే మంచిది. ముందుగా ముఖాన్ని నీటితో బాగా శుభ్రంగా కడుకున్న తరువాత అరటిపండు గుజ్జును ముఖం అంతా సమానంగా పట్టించి 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇలాచేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది. అరటిపండు తొక్కతో ముఖం మీద తేలికగా రజ్ చేస్తూ చర్మంలో ఉన్న మృతుకణాలను తొలగించుకోవాలి. 
 
మృతుకణాల తొలగింపు తరువాత అరటిపండులో కోకో బటర్ కలిపి ముఖానికి మసాజ్ చేసుకోవాలి. 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. చివరగా బనానా పాక్‌ను మెడకి పట్టించి 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో మెడను శుభ్రం చేసుకొని మెత్తటి టవల్‌తో తుడుచుకుంటే మెడ అందంగా కనబడుతుంది. న్యూట్రిషన్‌ విలువలున్న వీటి వలన ఎండిపోయినట్టున్న మీ చర్మం మృదువుగా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదేమన్నా రోడ్డుపై వెళ్లే బస్సా? 37,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం డోర్ తీయబోయాడు (video)

ఉండేదేమో అద్దె ఇల్లు, కానీ గుండెల నిండా అవినీతి, గోతాల్లో డబ్బుంది

రాహుల్ గాంధీకి అస్వస్థత - ఎన్నికల ప్రచారం రద్దు

అనంతపురం నారాయణ కళాశాల ఇంటర్ విద్యార్థి మేడ పైనుంచి దూకి ఆత్మహత్య (video)

అభిమాని చనిపోవడం బన్నీ చేతుల్లో లేకపోవచ్చు.. కానీ ఆ ఫ్యామిలీని పట్టించుకోకపోవడం? సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

తర్వాతి కథనం
Show comments