Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుపతికి విమానంలో వెళ్దాం... పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీ

ఒక్క రోజులో ఏడుకొండల వాడి దర్శనం.. త్రీస్టార్‌ హోటళ్లలో వసతి, భోజనం.. కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తిని కలుపుతూ యాత్ర.. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రారంభించిన ‘తిరుపతి టూర్‌’ ప్రత్యేకతలివి. టూరిజం శాఖ స్పైస్‌ జెట్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. సేవలను ఈ నె

తిరుపతికి విమానంలో వెళ్దాం... పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీ
, శనివారం, 26 మే 2018 (18:51 IST)
ఒక్క రోజులో ఏడుకొండల వాడి దర్శనం.. త్రీస్టార్‌ హోటళ్లలో వసతి, భోజనం.. కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తిని కలుపుతూ యాత్ర.. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రారంభించిన ‘తిరుపతి టూర్‌’ ప్రత్యేకతలివి. టూరిజం శాఖ స్పైస్‌ జెట్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. సేవలను ఈ నెల ఐదున లాంఛనంగా ప్రారంభించింది. ఇందులో రెండు ప్యాకేజీలున్నాయి. 
 
ఒక రోజు ప్యాకేజీ విలువ రూ.9,999. రెండు రోజుల ప్యాకేజీ ధర రూ.12,999. టికెట్లు టూరిజం శాఖ కార్యాలయాల్లో బుక్‌ చేసుకోవచ్చు. వారం రోజుల్లో ఆన్‌లైన్‌లో బుకింగ్‌ సౌకర్యం కల్పించనున్నారు.
 
ప్యాకేజీలు ఇలా వున్నాయి..
 
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉదయం 6:55 గంటలకు గగనతల యాత్ర మొదలవుతుంది. 
ఉదయం 8:10గంటలకి తిరుపతికి, 9:30లోపు తిరుమలకు చేరుకుంటారు. 
శ్రీవారి దర్శనం, తిరుచానూరు అమ్మవారి దర్శనం తర్వాత సాయంత్రం 5:30కు తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి రాత్రి 7:45కు హైదరాబాద్‌ వస్తారు. 
రెండు రోజుల ప్యాకేజీలో ఉదయం 9:25కి హైదరాబాద్‌లో ప్రయాణం మొదలవుతుంది. 
అదే రోజు శ్రీకాళహస్తి, కాణిపాకం సందర్శన, మరుసటి రోజు శ్రీవారు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటాయి. 
సాయంత్రం 6:35కు తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి రాత్రి 7:45కు హైదరాబాద్‌ చేరుకుంటారు.
webdunia
 
బుకింగ్‌ కోసం సంప్రదించాల్సిన నంబర్లు.. 
 
టికెట్లు బుక్‌ చేసుకోవాలనుకునే వాళ్లు సెంట్రల్‌ రిజర్వేషన్‌ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు. 
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌: 9848540371, 040- 29801039, ట్యాంక్‌బండ్‌-9848125720, పర్యాటక భవన్‌- 9848306435, శిల్పారామం- 9666578880, కూకట్‌పల్లి- 9848540374, సికింద్రాబాద్‌ యాత్రి నివాస్‌- 9848126947, వరంగల్‌-08702562236, నిజామాబాద్‌ 08462224403లను సంప్రదించవచ్చు.
 
ఇబ్బందులు ఉండవు. 
తిరుపతికి గగనతల ప్యాకేజీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాం. ఏ చిన్న ఇబ్బంది కూడా కలగకుండా టూరిస్టులను హైదరాబాద్‌కు చేరుస్తాం. అందులో భాగంగానే ట్రావెల్‌ ఏజెన్సీలు, హోటళ్లు, ఆలయాల ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. టూరిస్టుల కోసం ప్రత్యేక వసతులు కూడా ఏర్పాటు చేశాం. నాణ్యమైన సేవలు అందిస్తున్నామని ప్రతినిధులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్యేగా కాదు... ఎంపీగా పోటీ చేయబోతున్నా: బుట్టా రేణుక