మజ్జిగలో కొద్దిగ పసుపు కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టిస్తే...?

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (23:26 IST)
మజ్జిగలో కొద్దిగ పసుపు కలిపి పేస్టులా చేసుకోవాలి. దీనిని కంటి కింద రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు.
 
కంటి కింద ఏర్పడిన నల్లటి వలయాలు తొలగించుకోవటానికి టమాటాలు ఎంతగానో దోహదపడతాయి. ఒక టీ స్పూన్ టమోటా జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి కంటి కింద రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు.
 
బంగాళదుంపలను సన్నగా తరిగి జ్యూస్‌లా చేయాలి. దీనిలో కాటన్ బాల్స్‌ను ముంచి కంటి కింద ఉంచాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వలన నల్లటి మచ్చలు తగ్గుముఖం పడతాయి.
 
చల్లటి పాలలో దూది ఉండలను కొద్దిసేపు ఉంచి తర్వాత రిప్రిజిరేటర్లో పెట్టాలి. వీటిని కళ్లు, నల్లటి వలయాలు ఉన్న ప్రాంతాన్ని కవర్ చేస్తూ కంటి కింద ఉంచాలి. ఇలా తరుచుగా చేయడం వలన చర్మంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి.
 
ఆరెంజ్ జ్యూస్‌లో కొద్దిగా గ్లిజరిన్ కలిపి కంటికింద పూయాలి. ఇలా చేయడం వలన నల్లటి వలయాలు తగ్గడమే కాకుండా చక్కటి మెరుపు కూడా సంతరించుకుంటుంది.
 
కీరదోస ముక్కలను గుండ్రంగా తరిగి కంటి కింద పెట్టుకోవటం వలన నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దుస్తులు విప్పేసి వీడియో కాల్ చేసింది, టెంప్టై వలలో పడ్డాడు, రూ.3.4 లక్షలు హాంఫట్

బాల్య వివాహం, లైంగిక దాడి కేసు.. బాలిక తండ్రి, భర్తకు జీవిత ఖైదు.. రంగారెడ్డి కోర్టు

తెలంగాణలోని కొండగట్టు ఆలయానికి రూ.30కోట్లు.. పవన్ సిఫార్సు.. తితిదే గ్రీన్‌సిగ్నల్

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బర్త్ డే.. విమానంలో సర్ ప్రైజ్ ఇచ్చిన వైకాపా నేతలు.. మిథున్ రెడ్డి?

వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suhasini : వినోద్ కుమార్, సుహాసిని కాంబినేషన్ లో సినిమా

Sampoornesh Babu: నాని చిత్రం ది ప్యారడైజ్ లో సంపూర్ణేశ్ బాబు లుక్

Vijay Antony: బుకీ నుంచి విజయ్ ఆంటోనీ ఆలపించిన బ్రేకప్ యాంథమ్ రిలీజ్

'దురంధర్' చిత్రాన్ని చూసి పాఠాలు నేర్చుకోండి : రాంగోపాల్ వర్మ

మంచి ఛాన్స్ లభిస్తే రీఎంట్రీ : రకుల్ ప్రీత్ సింగ్

తర్వాతి కథనం
Show comments