ఐస్ క్యూబ్స్‌తో అందానికి మెరుగులు

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (22:05 IST)
ఐసు ముక్కలతో ముఖాన్ని రుద్దితే వృద్ధాప్య ఛాయలు దరిచేరవని చెపుతుంటారు. అంతేకాదు ఐసు ముక్కలతో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. మేకప్ వేసుకునే ముందు ఐస్ ముక్కను ముఖానికి రాసుకుని ఆ తర్వాత క్రీమును రాసుకుంటే అది చర్మం పైన బిగుతుగా అవుతుంది. దీనితో అక్కడి కణాలన్నీ ఉత్తేజితమవుతాయి. కంటి కింద ఐసు ముక్కతో మృదువుగా రాస్తే నల్లని వలయాలు తగ్గిపోతాయి.
 
ముఖం జిడ్డుగా వుంటే బయటి మలినాలు తేలికంగా చర్మంలోకి ఇంకి మొటిమలు, మచ్చలు వస్తాయి. ఇది రాకుండా వుండాలంటే ముఖానికి ఐసు ముక్కతో మర్దన చేయాలి. నిద్రలేమితో బాధపడేవారు, ఎక్కువ పని గంటలు కంప్యూటర్ పైన పని చేసేవారు ఐస్ క్యూబులను కంటి చుట్టూ చర్మంపై నెమ్మదిగా రాస్తే ఉపశమనం కలుగుతుంది.
 
పెదవులపై చర్మం పొడిబారినట్లు వుంటే వాటిపై ఐసు ముక్కతో మృదువుగా రాస్తే సమస్య తగ్గిపోతుంది. క్రమం తప్పకుండా ఐస్ క్యూబ్‌లను చర్మంపై రుద్దడం వల్ల వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి, నిరోధించడానికి ఒక గొప్ప మార్గం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని మూడు కోర్టులకు బాంబు బెదిరింపులు

సీఎం మమత వచ్చి కీలక డాక్యుమెంట్లను తీసుకెళ్లారు .... ఈడీ ఆరోపణలు

Chennai : చెన్నైలో 17 సంవత్సరాలకు తర్వాత డబుల్ డెక్కర్ బస్సులు

యూట్యూబర్ అన్వేష్‌పై ఫైర్ అయిన విదేశీ మహిళ - అతడిని భారత్‌కు పట్టుకొస్తా

బిచ్చగాడు కాదు.. లక్షాధీశుడు... యాచకుడి మృతదేహం వద్ద రూ.లక్షల్లో నగదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srivishnu: జాతకాలను జీవితానికి మిళితం చేస్తూ.. దేఖో విష్ణు విన్యాసం సాంగ్ ఆవిష్కరణ

ఫూలే సినిమా సేవా స్ఫూర్తి కలిగిస్తుంది : నిర్మాత పొన్నం రవిచంద్ర

Havish: రాజాసాబ్ థియేటర్లలో హవిష్ చిత్రం నేను రెడీ ఎక్స్‌క్లూజివ్ టీజర్ ప్రదర్శన

Yash: టాక్సిక్ టీజర్ లో శ‌శ్మానంలో గ‌న్స్‌తో మాఫియా పై యశ్ ఫైరింగ్

Shobhita Dhulipala: చీకటిలో ... చీకటి రహస్యాలను వెలికితీసే శోభిత ధూళిపాల

తర్వాతి కథనం
Show comments