వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీ పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. స్ట్రాబెర్రీ పండులో విటమిన్ ఎ, సి, కె, కాల్షియం, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
ముడతలు: స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ముడతలను నివారిస్తాయి. చర్మ కణాలను తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. నాలుగు స్ట్రాబెర్రీలను గ్రైండ్ చేసి ఒక చెంచా పెరుగు, ఒక చెంచా తేనె కలిపి ఫేస్ ప్యాక్‌గా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు చర్మం ముడతలు పడకుండా ఉంటాయి.
స్కిన్ గ్లో: స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్ సి, ఎల్లాజిక్ యాసిడ్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మీరు స్ట్రాబెర్రీని సగానికి కట్ చేసి మీ ముఖానికి స్క్రబ్‌గా ఉపయోగించవచ్చు. పాలలో మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయవచ్చు. తద్వారా స్కిన్ గ్లో అవుతుంది.
పెదవులు: స్ట్రాబెర్రీలు పెదవులకు చక్కని మెరుపును అందించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పెదవులపై ఉన్న మృతకణాలను తొలగిస్తాయి. స్ట్రాబెర్రీని సగానికి కట్ చేసి పెదవులపై రుద్దండి. పెట్రోలియం జెల్లీతో కలిపిన స్ట్రాబెర్రీ లిప్ బామ్‌గా ఉపయోగించవచ్చు.
చుండ్రు: చుండ్రు ఎక్కువగా ఉన్నట్లయితే, రెండు టీస్పూన్ల టీ ట్రీ ఆయిల్‌లో స్ట్రాబెర్రీ రసం కలిపి వారానికి ఒకసారి తలకు రాసుకుంటే చుండ్రు పోతుంది.