Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిల అందాన్ని పెంచే చిట్కాలు ఇవిగో...

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (21:11 IST)
సౌందర్యం కోసం యువతులు ఆరాటపడుతుంటారు. కొందరిలో చర్మం నిగారింపు లేక కళతప్పి కనిపిస్తుంది. చర్మం నిగనిగలాడుతూ మెరిసిపోవాలంటే అందుకు తగినది బాదం నూనె. ఇందులో విటమిన్ ఎ, ఇ ఉంటాయి. దీన్ని ఈ క్రింది విధంగా అప్లై చేస్తా మంచి ఫలితాలు వుంటాయి. 
 
1. ముఖ తేజస్సు పెరగాలంటే రెండు చెంచాల బాదం నూనెలో చెంచా నిమ్మరసం వేయాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి అర గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. ఈ విధంగా చేయడం ద్వారా నలుపు రంగు పోయి, తెల్లగా నిగారింపుతో మెరిసిపోతుంది. 
 
2. బాదం, ఆముదం నూనె మిశ్రమం జుట్టు పెరగడంలో సాయపడుతుంది. నాలుగు చెంచాల బాదం నూనెలో మూడు చెంచాల ఆముదం వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టుకు రాసి శుభ్రమైన వస్త్రంతో చుట్టేయాలి. అర గంటయ్యాక షాంపూతో కడిగేస్తే జుట్టు అందంగా ఉంటుంది.
 
3. అరచెంచా చొప్పున బాదంనూనె, తేనె తీసుకుని మిశ్రమంలా చేసి నిద్రపోయే ముందు నల్లటి వలయాలపై రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఆముదం, బాదం నూనె మిశ్రమాన్ని నల్లగా మారిన పెదాలపై తరచూ రాస్తే అవి గులాబీ రంగులోకి మారతాయి.
 
4. సమపాళ్లలో బాదం నూనె, తేనె మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి రాస్తే మృదువైన చర్మం మీ సొంతమవుతుంది. చెంచా చొప్పున బాదంనూనె, చక్కెర తీసుకుని కలపాలి. దాన్ని వేళ్లతో తీసుకుని ముఖంపై వలయాకారంగా పది నిమిషాల పాటు రుద్దాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. దీనివల్ల మృతకణాలు తొలగిపోయి ముఖం శుభ్రంగా మారుతుంది.
 
5. బాదం నూనె మృతకణాల్ని తొలగించడంలో సాయపడుతుంది. కొందరి ముఖంపై, శరీరంపైన నల్లటి వలయాలు ఏర్పడతాయి. అప్పుడు బాదం నూనెలో, కొబ్బరి నూనెను కలిపి నల్లటి వలయాలపై రాస్తే కొద్ది రోజులకు అవి మాయమవుతాయి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనె ముఖానికి రాస్తుంటే చర్మం మెరిసిపోతుంది. పావుగంట పాటు బాదం నూనెని ముఖానికి మర్దన చేశాక గంధంతో ఫేస్‌‌ప్యాక్ వేస్తే ముఖానికి అదనపు సొగసు చేరుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

తర్వాతి కథనం
Show comments