కుంకుమపువ్వు గురించి తెలియని వారు ఉండరు. దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కుంకుమపువ్వులో ధయామిన్, రైబోఫ్లెవిన్ ఉంటుంది. ఇది గర్భవతులకు ఎంతో మేలు చేస్తుంది. కుంకుమపువ్వును చిటికెడు మించకుండా పాలలో కలిపి ప్రతిరోజు తీసుకోవటం వలన జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్దక సమస్య తగ్గుతుంది. ఇది గర్భవతులకు ఆకలి పుట్టేలా చేస్తుంది. కనుక గర్భిణీ స్త్రీలు దీనిని తీసుకోవటం చాలా మంచిది. అంతేకాకుండా దీనిలో ఎన్నో ఔషధగుణాలు కూడా ఉన్నాయి. మంచి రుచి, కమ్మని వాసన ఇవ్వటం కోసం దీనిని కొన్ని రకాల వంటకాల్లో కూడా వాడుతుంటారు. దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
1. కడుపు ఉబ్బరం, అజీర్తిని తగ్గించేవి, కడుపు పట్టేయటం వంటి సమస్యల్ని దూరం చేసే గుణాలు కుంకుమపువ్వులో సమృద్దిగా ఉన్నాయి.
2. గుండె ఆరోగ్యాన్ని చక్కబరచడంతో పాటు రక్తంలోని కొలెస్ట్రాల్ నిలువల్ని కుంకుమపువ్వు తగ్గిస్తుంది.
3. కుంకుమపువ్వులో శరీరంలో తిరుగాడే హానికారక ఫ్రీ-ర్యాడికల్స్‌ను దెబ్బతీసే యాంటీ ఆక్సిడెంట్లు, శరీరంలో వాపు ఏర్పడకుండా నివారించే యాంటీ- ఇన్ఫ్లమేటరీ అంశాలు, జ్ఞాపకశక్తిని పెంచేవి కూడా కుంకుమపువ్వులో పుష్కలంగా ఉన్నాయి.
4. శరీరంలో వేడి ఎక్కువుగా ఉన్నవారు కుంకుమపువ్వు తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది.
5. కుంకుమపువ్వును సుగంధ ద్రవ్యాల్లో కూడా ఉపయోగిస్తారు.
6. కుంకుమపువ్వుని వివిధ రకాల క్యాన్సర్‌కు చికిత్సగా వాడుతుంటారు. ఇది ఊపిరితిత్తులను శుభ్రపరచి ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది.
7. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. కుంకుమపువ్వుని వేడి పాలలో వేసుకొని తాగటం వల్ల మానసిక వత్తిడి తగ్గుతుంది.