Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Heart Day: భారత యువత గుండె ఎందుకు బలహీనమవుతోంది?

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (12:12 IST)
అది 2016 శీతాకాలం. 29 ఏళ్ల అమిత్ దిల్లీలో తన ఇంట్లో వెచ్చగా దుప్పటి కప్పుకుని కలలు కంటున్నాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో అతనికి హఠాత్తుగా ఛాతీ నొప్పి వచ్చింది. అతని ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. ఆ సమయంలో అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఇంటి వద్ద ఎవరూ లేరు.

 
అమిత్ అలాగే ఆ బాధను ఓర్చుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత నొప్పి తగ్గిపోయి, అతను నిద్రపోయాడు. అయితే నొప్పి తగ్గిపోవడంతో ఉదయం డాక్టర్ వద్దకు వెళ్లలేదు. కానీ మరుసటి రోజు కూడా అదే విధంగా నొప్పి రావడంతో అమిత్ డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. అమిత్ చెప్పిందంతా విన్న డాక్టర్ అతణ్ని ఎకో-కార్డియోగ్రామ్ తీయించుకొమ్మని సలహా ఇచ్చాడు. ఆ పరీక్షలో అతనికి అంతకు ముందు రాత్రి వచ్చింది గుండెపోటు అని తెలిసింది. డాక్టర్ చెప్పింది విని అమిత్‌కు మతి పోయినంత పనైంది. అంత చిన్న వయసులో గుండెపోటు ఎలా వస్తుందో అతనికి అర్థం కాలేదు.

 
గుండెపోటు కేసులు
భారతదేశంలో రోజురోజుకీ చిన్న వయసులోనే గుండెపోటు వస్తున్న కేసులు పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మే 24న కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు బండారు వైష్ణవ్ గుండెపోటుతో మరణించాడు. హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న వైష్ణవ్ వయసు కేవలం 21 ఏళ్లే. రాత్రి భోజనం చేస్తుండగా, తనకు ఛాతీలో నొప్పిగా ఉందని వైష్ణవ్ తెలిపాడు. వైష్ణవ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

 
యుక్త వయసులోనే గుండెజబ్బులు
అమెరికాలోని ఒక పరిశోధనా పత్రికలో ప్రచురించిన వ్యాసం ప్రకారం, 2015 నాటికి భారతదేశంలో సుమారు 6.2 కోట్ల మందికి గుండెకు సంబంధించిన జబ్బులున్నాయి. వారిలో 2.3 కోట్ల మంది వయసు 40 ఏళ్ల లోపే. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా యువతలో గుండెజబ్బులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. healthdata.org ప్రకారం, 2005లో అకాల మృత్యువుకు కారణాలలో గుండెజబ్బు మూడో స్థానంలో ఉంది. అయితే 2016 నాటికి గుండె జబ్బు మొదటి కారణంగా మారింది. 10-15 ఏళ్ల క్రితం గుండె జబ్బులు కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చేవి. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితి మారింది.

 
గుండె బలహీనతకు కారణాలు
ప్రముఖ కార్డియాలజిస్టు, పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన డాక్టర్ ఎంసీ మన్‌చందా, దేశంలో యువత గుండెలు బలహీనపడ్డాయని తెలిపారు. ప్రస్తుతం దిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్ మన్‌చందా, నేటి ఆధునిక జీవన విధానమే గుండె బలహీనపడడానికి కారణమని భావిస్తున్నారు. యువతలోని 'లైఫ్ స్టైల్ డిజార్డర్'కు ఐదు ప్రధాన కారణాలున్నాయని ఆయన తెలిపారు. అవి:

 
జీవితంలో ఒత్తిడి
చెడు ఆహారపు అలవాట్లు
చాలా పొద్దుపోయే వరకు కంప్యూటర్లు, ఎలెక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం
సిగరెట్లు, పొగాకు, మద్యం అలవాట్లు
వాతావరణ కాలుష్యం

 
29 ఏళ్ల అమిత్ కావచ్చు, 21 ఏళ్ల వైష్ణవ్ కావచ్చు. ఈ ఐదు కారణాలే వాళ్లకు గుండెపోటు రావడానికి కారణమని డాక్టర్ మన్‌చందా అభిప్రాయపడ్డారు. 22 ఏళ్ల వయసు నుంచి తాను సిగరెట్లు తాగుతున్నట్లు అమిత్ బీబీసీకి తెలిపారు. కానీ తనకు గుండెజబ్బు వచ్చిన రెండేళ్ల తర్వాత అతను సిగరెట్లు మానేశాడు. అయితే వైష్ణవ్‌కు గుండెపోటు రావడానికి కారణాలు తెలియకున్నా, నేడు చదువులు తీవ్ర ఒత్తిడి పెరిగిపోయిన మాట వాస్తవం. అదే కాకుండా - సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, గంటలకొద్దీ ఎలెక్ట్రానిక్ పరికరాలతో గడపడం అన్నది కొత్త విషయమేమీ కాదు.

 
గుండెపోటు సూచనలు
ఛాతీలో నొప్పిగా అనిపించడమే గుండెపోటుకు పెద్ద ముఖ్యమైన సూచన అని డాక్టర్లు విశ్వసిస్తున్నారు. గుండెపోటు వచ్చినపుడు మీ ఛాతీని ఎవరో గట్టిగా నొక్కుతున్నట్లు అనిపిస్తుంది. అయితే అది అన్నిసార్లూ అలా కాకపోవచ్చు. గుండె వరకూ రక్తం పూర్తిగా సరఫరా కాకపోవడం వల్లనే గుండెపోటు వస్తుంది. సాధారణంగా ధమనులలో ఏదైనా అడ్డంకి ఏర్పడ్డం వల్ల రక్తం గుండె వరకు చేరలేదు. అప్పుడు ఛాతీలో తీవ్రమైన నొప్పి వస్తుంది. కానీ కొన్నిసార్లు నొప్పి లేకుండానే గుండెపోటు వస్తుంది. దీనిని 'సైలెంట్ హార్ట్ అటాక్' అంటారు.

 
healthdata.org ప్రకారం, ప్రపంచంలో వివిధ కారణాలతో సంభవించే మరణాల్లో గుండెపోటు ప్రథమస్థానంలో ఉంది. 2016లో వివిధ కారణాలతో మరణించిన వారి వివరాలను పరిశీలించగా, వారిలో 53 శాతం మంది గుండెపోటుతోనే మరణించారు.

 
ఎలాంటి మహిళలకు గుండెపోటు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది?
ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన డాక్టర్ కె.అగర్వాల్, మహిళల్లో ప్రీ-మెనోపాజ్ గుండెజబ్బులు ఉండవని తెలిపారు. దీనికి కారణం మహిళలలోని సెక్స్ హార్మోన్లు గుండె జబ్బుల నుంచి వాళ్లను రక్షిస్తాయి. కానీ గత కొంతకాలంగా మహిళలలో ప్రీ మెనోపాజ్ దశలో కూడా గుండెజబ్బులు వస్తున్నాయి. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ప్రకారం, ''మహిళలు సిగరెట్లు తాగడం లేదా దీర్ఘకాలం పాటు కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడడం వంటి కారణాల వల్ల వాళ్లలో గుండెజబ్బులతో పోరాడే శక్తి తగ్గిపోతుంది'' అని తెలిపారు.

 
గుండెపోటు నుంచి ఎలా రక్షించుకోవాలి?
గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే, యువత తన జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని డాక్టర్ మన్‌చందా అంటారు. గుండెపోటును నివారించడంలో యోగ చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని తెలిపారు. యువతలో గుండెపోటు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం కూడా కొంత కృషి చేయాలని డాక్టర్ మన్‌చందా అంటారు.

 
''జంక్ ఫుడ్స్‌పై ప్రభుత్వం ఎక్కువ పన్నులు విధించాలి. అదే విధంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై కూడా. అంతే కాకుండా జంక్ ఫుడ్స్‌పై వాటిని తింటే వచ్చే ప్రమాదాల గురించి పెద్దగా ముద్రించాలి'' అన్నారాయన. దీని వల్ల సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోవచ్చు కానీ, ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. శరీరంలోని కొలెస్టరాల్ శాతంపై గుండె జబ్బులు ఆధారపడి ఉంటాయని, కాబట్టి ఎక్కువ నూనె ఉండే ఆహార పదార్థాలను తినడం తగ్గించాలని కొంతమంది అంటుంటారు. దీనిలో నిజమెంత?

 
దీనిపై డాక్టర్ మన్‌చందా, గుండెపోటుకు కొలెస్టరాల్ కారణం కాకపోవచ్చు కానీ ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా గుండెపోటును కారణమని అంటారు. ట్రాన్స్ ఫ్యాట్ శరీరంలోని మంచి కొలెస్టరాల్‌ను తగ్గించి, చెడు కొలెస్టరాల్‌ను పెంచుతుంది. వనస్పతిలో ఎక్కువగా ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. అందువల్ల వాటిని వాడడం నిలిపివేయాలని ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం