Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రసవం తర్వాత ఎలాంటి ఆహారం తీసువాలి?

Webdunia
ఆదివారం, 4 నవంబరు 2018 (11:53 IST)
సాధారణంగా ప్రతి యువతి పెళ్లి తర్వా తల్లికావాలని కోరుకుంటుంది. తల్లి కావడం స్త్రీకి నిజంగానే ఓ వరం. పైగా, తల్లికావడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకునే మహిళలు.. ప్రసవం తర్వాత తమ ఆరోగ్యంపై అశ్రద్ధ చూపుతారు. పూర్తిగా తమ చిన్నారి ఆరోగ్యం, పెంపకంపైనే శ్రద్ధ చూపుతూ.. తమ ఆరోగ్యం గురించి మరిచిపోతారు. 
 
పైగా, డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన ఆహారంపై చాలామందిలో అపోహలుంటాయి. నీళ్లు ఎక్కువగా తాగకూడదు. పప్పు తినకూడదంటుంటారు. నీళ్లు ఎక్కువగా తాగడం మూలంగా పొట్ట వస్తుందన్న అపోహలు ఉంటాయి. నిజానికి ఇవి కేవలు అపోహ మాత్రమేనని, వీటిలో ఏమాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా, పప్పులో ప్రొటీన్స్‌ ఉంటాయి. కాబట్టి పప్పును దూరపెట్టడం శ్రేయస్కరం కాదంటున్నారు. 
 
అలాగే, డెలివరీ తర్వాత ప్రతీ తల్లి శారీరక అంశాలపై దృష్టి పెట్టాలి. ఇంట్లో తల్లిదండ్రులు డెలివరీ తర్వాత నాలుగైదు రోజుల వరకు స్నానం చేయనివ్వరు. కానీ అది కూడా తప్పేనంటున్నారు వైద్యులు. రెగ్యులర్‌గా స్నానం చేయాలని సూచిస్తున్నారు. మసాజ్‌ చేయించుకుంటే మరీ మంచిదంటున్నారు. కండరాలు పటుత్వం కోల్పోకుండా ఉంటాయంటున్నారు. సిజేరియన్‌ అయినట్లయితే కుట్ల దగ్గర కాస్త జాగ్రత్తగా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. 
 
అలాగే నెలకొకసారి మూడునెలలపాటు వైద్యులను సంప్రదించాలి. గర్భందాల్చినప్పటి నుంచి వేసుకుంటూ వస్తున్న ఐరన్‌, కాల్షియం మాత్రలను డెలివరీ తర్వాత చాలామంది ఆడవాళ్లు  మానేస్తుంటారు. కానీ అది కూడా మంచిది కాదంటున్నారు వైద్యులు. డెలివరీ తర్వాత కూడా మూడు నెలల పాటు ఆ మందులను తప్పనిసరిగా వాడాలని సూచిస్తున్నారు. అప్పుడే రక్తహీనత సమస్య రాకుండా ఉంటుందంటున్నారు. అదేసమయంలో ఆకుకూరలు, పండ్లు, పప్పులు అధికంగా తీసుకోవాలని వైద్యులు సూచన చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

తర్వాతి కథనం
Show comments