Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో కఫంకు ఇలా చెక్..

Webdunia
ఆదివారం, 15 డిశెంబరు 2019 (18:29 IST)
చలికాలంలో చిన్నపిల్లలకు ఛాతీలో కఫం పేరుకుపోవడం సహజం. చెంచా వాముని కడాయిలో వేసి దోరగా వేయించండి. వాటిని ఓ పలుచటి వస్త్రంలో మూట కట్టి... పిల్లల ఛాతీపై మృదువుగా కాపడం పెడితే ఆయాసం తగ్గి, ఊపిరి తేలికగా తీసుకోగలుగుతారు.
 
గ్లాసు పాలను మరిగించి అరచెంచా మిరియాల పొడి, కొంచెం బెల్లం కలిపి రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేస్తే, జలుబు నుంచి ఉపశమనం పొందొచ్ఛు. మరిగించిన కప్పు నీటిలో చెంచా మిరియాల పొడి వేసి కషాయంలా కాయాలి. దీనికి ఉప్పు కలిపి బాగా పుక్కిలిస్తుంటే టాన్సిల్స్‌కు దూరంగా ఉండొచ్ఛు గొంతు నొప్పి తగ్గుముఖం పడుతుంది.
 
కడాయిలో అరచెంచా నెయ్యి వేసి, వేడయ్యాక శొంఠి కొమ్ముని వేయించి చల్లార్చాలి. తరువాత పొడి చేసుకోవాలి. ఈ పొడిని అన్నంలో నెయ్యితోపాటు కలిపి మొదటి ముద్దగా నిత్యం తీసుకోవాలి. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
 
ఈ కాలంలో కీళ్ల నొప్పులు చికాకుపెడతాయి. అలాంటప్పుడు శొంఠి కొమ్ముని అరగదీసి, ఆ గంధాన్ని కొద్దిగా వెచ్చబెట్టి కీళ్లపై పలుచని పొరలా లేపనం వేసుకోవాలి. ఇలా చేస్తే, నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments