Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొలల వ్యాధికి చేమదుంప కూర సూప్‌... ఎలా పనిచేస్తుంది...?

గంటల గంటలు టీవీల ముందు, కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? అయితే మొలల వ్యాధి తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధిబారిన పడకుండా ఉండాలంటే.. రోజూ వ్యాయామం చేయాలి. రక్తప్రసరణను మెరుగుపరుచుకో

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (15:18 IST)
గంటల గంటలు టీవీల ముందు, కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? అయితే మొలల వ్యాధి తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధిబారిన పడకుండా ఉండాలంటే.. రోజూ వ్యాయామం చేయాలి. రక్తప్రసరణను మెరుగుపరుచుకోవాలి. అంతేగాకుండా ఆహారంలో చేమదుంపల కూరను ఆహారంలో చేర్చుకోవాలి.

ఇంకా మందారపూవులు కూడా మొలల వ్యాధిని నయం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. చేమదుంపలను కూరగానూ వేపుడుగానూ వారానికి ఒకసారి తీసుకుంటే మొలల వ్యాధి నయం అవుతుంది. అలాగే మందారపూవులను కూడా తీసుకుంటే పైల్స్‌ను దూరం చేసుకోవచ్చు. 
 
చేమదుంపల ఆకుల్లో విటమిన్ ఎ, సి, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. తద్వారా చేమదుంపలు లేదా ఆకుకూరను వారానికి రెండుసార్లు ఆహారంలో చేర్చుకుంటే మొలల వ్యాధిని తరిమికొట్టవచ్చు. ఇంకా మోకాళ్ల నొప్పి నయం చేసుకోవచ్చు. ఇక మందార రేకులు  మన శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. వాత, పిత్త వ్యాధులను దరిచేరనివ్వదు. 
 
అలాంటి మందార పూవుల రేకులతో నరాలకు బలం చేకూర్చే, మొలల వ్యాధిని దూరం చేసే షర్బత్‌ను ఎలా చేయాలో చూద్దాం. ఓ పాత్రలో రెండు గ్లాసుల నీటిని పోసి.. అందులో మందాల పూవు రేకులు పదింటిని వేసి మరిగించాలి. ఆపై అరగ్లాసు నిమ్మరసాన్ని అందులో చేర్చాలి. రుచికి తగినట్లు బెల్లాన్ని కలుపుకుని.. కాసేపు మరిగించి.. ఆపై సర్వింగ్ గ్లాసులో వడగట్టి తీసుకుంటే మొలల వ్యాధి నయం అవుతుంది. 
 
ఈ షర్బత్‌ను వేసవిలో తీసుకుంటే.. శరీర వేడి తగ్గుతుంది. పేగు సంబంధిత రుగ్మతలు దూరమవుతాయి. ఇందులో నిమ్మరసాన్ని చేర్చడం ద్వారా టాక్సిన్లు తొలగిపోతాయి. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అలాగే చేమదుంపల ఆకులను సన్నగా తరిగి వాటిని సూప్‌లా తయారు చేసి వారానికి రెండు సార్లు తీసుకుంటే.. మొల వ్యాధులను పూర్తిగా దూరం చేసుకోవచ్చు. 
 
చేమదుంపల ఆకులతో సూప్ ఎలా చేయాలంటే?.. స్టౌ మీద బాణలి పెట్టి.. చేమదుంపల ఆకులు, కాసింత చింతపండు రసం, నువ్వుల నూనె, ఆవాలు, వెల్లుల్లిపాయలు, చిటికెడు మిరియాల పొడి, తగినంత ఉప్పు, ఇంగువ చేర్చి బాగా వేపాలి. బాగా వేగాక ఈ మిశ్రమానికి కాసింత నీటిని చేర్చి మరగించాలి. పది నిమిషాల తర్వాత ఈ సూప్‌లో కాసింత నెయ్యిని చేర్చి తీసుకుంటే మొల వ్యాధులు దరిచేరవు. శరీరానికి బలం చేకూరుతుంది. మహిళల్లో నెలసరి సమస్యలుండవని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

PoK: పెరిగిన జీలం నది నీటి మట్టం- అంతా భారత్ చేసిందా.. వరద ముప్పు..? (video)

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments